అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు

స్టార్ యాంకర్ గా ఝాన్సీది దాదాపు రెండు దశాబ్దాలకు పైగా జర్నీ. అలాగే నటిగా కూడా ఆమె 26ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నారు. ఈ రెండు రంగాలలో ఝాన్సీ నిరవధికంగా రాణిస్తున్నారు. ప్రొఫెషనల్ గా ఎంతో సక్సెస్ చూసిన ఝాన్సీ పర్సనల్ లైఫ్ లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. జోగి బ్రదర్స్ అనే ఓ టాక్ షోతో బాగా పాప్యులర్ అయిన జోగి నాయుడుని ఝాన్సీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐతే పెళ్ళైన ఎనిమిదేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. అప్పటికి వీరికి ఓ పాప కూడా ఉంది.

కోర్ట్ ఆదేశాలతో కూతురు ఝాన్సీ దగ్గరే పెరుగుతున్నారు. వీరిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతుంది. ఆమె మాజీ భర్త జోగినాయుడు సౌజన్య అనే మరో యువతిని పెళ్ళాడడం జరిగింది. ఐతే ఝాన్సీ మాత్రం మరలా పెళ్లి చేసుకోలేదు. కాగా ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఝాన్సీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. అప్పట్లో భర్తతో విడిపోయిన సంధర్భంలో తనపై వచ్చిన వార్తలు చాలా బాధపెట్టాయి అన్నారు .

నిరాధారమైన కథనాలు, ఆరోపణలు ఆవేదనకు గురిచేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. కాగా మరలా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఆమె చెప్పారు. తనకు సింగిల్ గా బ్రతకడమే బాగుందని ఆమె చెప్పుకొచ్చారు. భార్యాభర్తల బంధంలో సుఖం లేనప్పుడు ఒంటరిగా జీవించడమే హాయి అన్నట్లుగా ఆమె చెప్పడం విశేషం. గత ఏడాది దాదాపు 10 చిత్రాలలో నటించిన ఝాన్సీ మహర్షి, రూలర్, మన్మథుడు 2 వంటి భారీ చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు.


ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus