కుల రాజకీయాలు లోతైనవి అంటున్న ఝాన్సీ

భారతదేశంలోని మీడియాకు నటి, యాంకర్ ఝాన్సీ ఓ డిమాండ్ చేశారు. రిపోర్టింగ్ స్టయిల్ మార్చమని ఆమె సూచించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఈ నెల 14న సామూహిక అత్యాచారానికి గురైన యువతి సోమవారం మరణించింది. హత్యాచార కాండకు పాల్పడిన నలుగురు దోషులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను రిపోర్ట్ చేసే విషయంలో స్టయిల్ చేంజ్ చేయాలని ఝాన్సీ డిమాండ్ చేస్తున్నారు. “మహిళలపై లైంగిక దాడి, వేధింపులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడు బాధితులను కాకుండా దోషులను హైలైట్ చెయ్యండి.

వార్తను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధానాన్ని మార్చండి” అని ఝాన్సీ పేర్కొన్నారు. దోషులను అరెస్టు చేశారా? ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? బాధితురాలికి నైతిక చట్టపరమైన మద్దతు ఉందా? దోషులకు శిక్ష పడితే… ఏ విధమైన శిక్ష పడుతుంది? ఈ విధంగా సరైన ప్రశ్నలు అడగాలని ఝాన్సీ కోరారు. బాధితురాలి ఫోటోలను ప్రచురించవద్దని, టీవీల ప్రసారం చేయవద్దని ఝాన్సీ పేర్కొన్నారు. కేసును సెన్సేషనల్ చెయ్యకుండా… వివరాలను మాత్రమే ప్రజలకు అందించాలన్నారు.

“ఇటువంటి కేసులలో కులాన్ని ఎందుకు తీసుకొస్తారు? కులాలకు అతీతంగా దోషులను శిక్షించాలి” అని నెటిజన్ ఒక కామెంట్ చేయగా… “మనం అర్థం చేసుకున్న దాని కంటే కుల రాజకీయాలు లోతైనవి” అని ఝాన్సీ రిప్లై ఇచ్చారు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus