Lasya: అభిమానులతో గుడ్ న్యూస్.. షేర్ చేసుకున్న లాస్య..!

టాలీవుడ్లో స్టార్ యాంకర్‌ గా ఓ వెలుగు వెలిగింది లాస్య.మా టీవీ లో వచ్చే ఓ షోలో ఈమె యాంకర్ రవితో పాటు సందడి చేసేది. అటు తర్వాత ఢీ వంటి షోలలో కూడా పాల్గొంది. ఇప్పుడు ఈమె హవా కాస్త తగ్గింది. అయితే ‘బిగ్ బాస్ 4’ లో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వరుస షోలతో బిజీగా మారుతుంది ఈ అమ్మడు. ఈమె క్యూట్ గా చెప్పే చీమ ఏనుగు జోక్స్‌ కు కొంతమంది అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు.

కేవలం లాస్య చలాకీ తనం వల్లనే ఆ జోక్స్ అంతగా పేలాయి అని చెప్పవచ్చు. ఇక లాస్య ప్రస్తుతం తన యూట్యూబ్‌ ఛానెల్‌ ను కూడా డెవలప్ చేసుకునే పనిలో పడింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వీడియోలతో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.మొన్నటికి మొన్న లాస్య హాస్పిటల్‌ బెడ్ పై దిగిన ఫోటో ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాస్య భర్త మంజునాథ్ ఆ ఫోటోని పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ కంగారు పడ్డారు.

పైగా ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్ కూడా పెట్టాడు మంజునాథ్. అటు తర్వాత ఆమెకు పరిస్థితి బాగానే ఉంది అని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా… లాస్య దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారట. ఈ విషయాన్ని లాస్య తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

‘ఐ యాం ప్రెగ్నెంట్ అగైన్’ ‘బేబీ ఇన్ ప్రోగ్రెస్’ ‘మా ఫ్యామిలీ మరో రెండు ఫీట్లు పెరగనుంది’ అంటూ ఆమె లేటెస్ట్ పోస్ట్ లో పేర్కొంది. అంతేకాదు తన ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయినట్టు ‘ప్రెగా న్యూస్ ఫలితాన్ని’ కూడా చూపిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

1

2

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus