అనారోగ్యం పాలైన ప్రదీప్.. అసలు నిజం ఏంటి?

  • July 8, 2020 / 12:15 PM IST

ఫిమేల్ యాంకర్స్ లో సుమకు ఎంత క్రేజ్ ఉందొ.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కు అంత క్రేజ్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ప్రదీప్.. గతకొంత కాలంగా లేదు.. అనే కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. తన రెమ్యునరేషన్ ను పెంచేయడంతో షోలకి అతనిని తీసుకోవట్లేదు అని కొంతమంది అంటున్నారు. అయితే.. దాని పై ఎటువంటి క్లారిటీ లేదు. ఆ వార్తల్లో అస్సలు నిజం లేదని .. కారణం వేరే ఉందని మరో యాంకర్ రవి క్లారిటీ ఇచ్చాడు.

అసలు విషయం ఏంటంటే.. ప్రదీప్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడని.., ఇప్పుడిప్పుడే సాధారణ స్థితిలోకి వస్తున్నాడని పేర్కొన్నాడు రవి. ‘ఢీ జోడిలో’ ఇటీవల ఎంట్రీ ఇచ్చిన రవి.. ప్రదీప్ లేకపోవడం గురించి.. అలాగే ఆ విషయం పై వస్తోన్న రూమర్స్ పై … చెక్ పెట్టేలా అసలు విషయాన్ని చెప్పాడు రవి. ‘అక్టోబరు23న.. ప్రదీప్ పుట్టిన రోజు జరుపుకున్నాడని.. ఆ పార్టీలో మేము కూడా పాల్గొన్నామని తెలిపాడు. ఇక పూర్తిగా కోలుకున్న వెంటనే.. రీ ఎంట్రీ ఇస్తాడన్న రవి చెప్పాడు . అయితే.. ప్రదీప్ కు ఎటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అనేదాని పై చర్చ మొదలైంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus