Rashmi: ఉపేక్షించేది లేదు… నెటిజన్ కు తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చిన రష్మీ!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పట్ల నేటిజన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇదివరకు తన గురించి ఏ విధమైనటువంటి కామెంట్ లు చేసిన పెద్దగా పట్టించుకోని రష్మీ తాజాగా ఓ నెటిజన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విధంగా నేటిజన్ రష్మీ నీ ఉద్దేశిస్తూ కామెంట్ చేయడమే కాకుండా ఆ కామెంట్ ను ఆమెను ట్యాగ్ చేయడంతో ఈ విషయంపై రష్మి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైపర్ ఆదితో రష్మీ గౌతమ్ (Rashmi) వైల్డ్ రొమాన్స్ చేస్తోంది. రష్మీ సుధీర్ తో కేవలం టిఆర్పి రేటింగ్ కోసం రొమాన్స్ చేసినప్పటికీ ఆదిని ఎంతగానో ఇష్టపడుతుంది అంటూ కామెంట్ చేస్తూ రష్మిని ట్యాగ్ చేశారు. ఇక ఈ విషయంపై రష్మీ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ విధమైనటువంటి వేధింపులను సహించాను. అయితే తాజాగా నాపై ఇలాంటి కామెంట్స్ చేయడమే కాకుండా నన్నే ట్యాగ్ చేసే అంత ధైర్యం వచ్చింది.

ఇక ఉపేక్షించేది లేదు నువ్వు దీనికి అనుభవిస్తావు అంటూ కామెంట్ చేయడంతో సదరు నెటిజన్ ఒక్కసారిగా భయంతో ఒణికిపోయారు. ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను నాకు ఫ్యామిలీ ఉంది ఈసారికి నన్ను క్షమించండి అంటూ కాళ్ళ బేరానికి వచ్చారు. అయితే అయితే ఈ క్షమాపణలు నువ్వు సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పుకో అంటూ రష్మి తిరిగి రిప్లై ఇచ్చారు. ఇలా నేటిజన్ తనని బ్రతిమలాడుతూ ఇంస్టాగ్రామ్ లో ఆమెతో చాట్ చేశారు.

అయితే ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనని క్షమించాల వద్ద అంటూ ప్రశ్నించగా చాలామంది ఈసారికి వదిలేయండి పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus