‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ఛాలెంజ్ పై మండిపడ్డ రష్మి

‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ కాన్సెప్ట్ ఏంటంటే.. ‘ఓ టేబుల్‌ పై బాటిల్‌ను పెట్టి, దాని మూతను లూజ్ గా ఉంచాలి. దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. ఈ ఛాలెంజ్ ను అక్షయ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, అర్జున్ షార్జా వంటి సెలెబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా ఈ ఛాలెంజ్‌ లో పాల్గొంటున్నారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఛాలెంజ్ పై యాంకర్ రష్మి ఫైరయ్యింది. తన సోషల్ మీడియా ద్వారా రష్మీ స్పందిస్తూ…. “బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ను నిజంగానే సీరియస్ గా తీసుకుంటున్నారా..? అసలు ఇలాంటివి చేసేవాళ్ళకు పనీపాటా లేదా.? ఇలాంటి వాటి పై శ్రద్ధ పెట్టేకంటే పనికొచ్చే విషయాల పై పెడితే బాగుంటుంది. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేవారు సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళు సెలబ్రిటీలు చేసే మంచి పనులకు కూడా పాల్గొనాలి. కానీ అభిమానులు అని చెప్పుకుంటున్న వాళ్ళు సెలబ్రిటీలు చేసే మంచి పనుల్లో ఒక్కటి కూడా చెయ్యడం లేదు” అంటూ పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus