Rashmi: నీ అడ్రస్ చెప్పు నేనే వస్తా… నెటిజన్ కు ఛాలెంజ్ చేసిన రష్మి!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యాంకర్ రష్మి గౌతమ్ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మూగజీవాలకు సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.

స్వతగాహ ఈమె జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా మూగజీవాలను ఎవరైనా హింసిస్తే తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా హైదరాబాద్లో అంబర్ పేటఘటన పెద్ద ఎత్తున వివాదానికి కారణం అవుతుంది వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించడం అందరిని ఎంతగానో కలిచి వేసింది. ఇక ఈ ఘటనపై యాంకర్ రష్మి స్పందిస్తూ మూగజీవాలు కూడా ప్రాణులే కదా వాటికంటూ ప్రత్యేకమైన వసతి కల్పిస్తే ఇలాంటి చర్యలు జరగవు అంటూ కుక్కలకు మద్దతు తెలిపారు.

దీంతో కొందరు ఈమె చేసినటువంటి ట్వీట్ కి మద్దతు ప్రకటించగా మరికొందరు మాత్రం నీకు పిల్లాడి ప్రాణం కన్నా కుక్కలే ఎక్కువ అయ్యాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ రష్మీ చేసినటువంటి ట్వీట్ పై స్పందిస్తూ…ఈ కుక్క రశ్మిని కుక్కను కొట్టినట్టు కొట్టాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో నేటిజన్ చేసిన కామెంట్ పై స్పందించిన రష్మీ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలోనే రష్మీ స్పందిస్తూ తప్పకుండా నీ అడ్రస్ చెబితే నేనే వచ్చి నిన్ను కలుస్తా… ఎలా కొడతావో నేను చూస్తా… నీకు ఇదే చాలెంజ్ అంటూ ఈమె నెటిజన్ కామెంట్ కు రిప్లై ఇచ్చారు. ఇలా ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus