బుల్లి తెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ ఒకరు.ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె వ్యాక్యతగా వ్యవహరిస్తున్నారు.ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ మరోవైపు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ విధంగా కెరియర్ లో ఎంత సక్సెస్ అయినటువంటి రష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఇక మూగజీవాలపై ఈమెకు ఎంతో ప్రేమ అనే విషయం మనకు తెలిసిందే. ఎవరైనా మూగజీవాలకు హానీ చేస్తే వారికి శిక్ష పడే వరకు ఈమె పోరాటం చేస్తూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు హాని చేసిన వారి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రష్మి తాజాగా మరోసారి మండిపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాలలో కోడిపందేలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక డాక్టర్ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండుసార్లు కోడిపందంలో గెలిచానని
ఈ పండుగను తాను ఎంజాయ్ చేస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.అయితే ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను రష్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నీ డాక్టర్ సర్టిఫికెట్ తీసుకెళ్లి మురికి కాలువలో పడెయ్ ఇలా హింసను ప్రోత్సహిస్తున్నారా అంటూ ట్వీట్ చేశారు. ఇలా ఈ విషయం గురించి ట్విట్టర్ లో కొంత సమయం పాటు చర్చలు జరిగాయి.అనంతరం ఒక నెటిజన్ ఈ విషయం పై స్పందిస్తూ…
కోడికి లేని బాధ మీకే ఎందుకు మేడం..ఇది గర్వం కాదు..మా సాంప్రదాయం అంటూ ట్వీట్ చేశారు. సదరు నెటిజన్ ఇలా ట్వీట్ చేయడంతో రష్మీ స్పందిస్తూ కోడికి బాధ లేదని నీకు తెలుసా.. అయినా మీరు మనుషుల మధ్య పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు గ్లాడియేటర్ పోరాటాలు సాంప్రదాయాలలో భాగమే. వాటిని స్వీకరించి చనిపోయే వరకు మనుషులను పంపాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.