‘జబర్దస్త్’ ‘ ఎక్స్ ట్రా జబర్దస్త్’ ‘ఢీ’ వంటి షోలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది రష్మీ. తొలినాళ్లలో ‘హోలీ’ ‘కరెంట్’ ‘ప్రస్థానం’ ‘ఎవరైనా ఎపుడైనా’ వంటి సినిమాల్లో నటించిన రష్మీకి ఆ పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అయితే టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది. ఆమె సోషల్ మీడియా ఎకౌంటు కు కూడా భారీ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో మళ్ళీ సినిమాల్లో రాణించాలి అని భావించి … ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రం చేసింది.
ఈ చిత్రం బాగానే ఆడింది కానీ ఇందులో మితి మీరిన గ్లామర్ షో కారణంగా … తరువాత కూడా ఈమెకు ఇలాంటి అవకాశాలే వచ్చాయి. ‘అంతం’ ‘అంతకు మించి’ అనే చిత్రాలు ఇదే కోవలోకి వస్తాయి. దీంతో ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రం చెయ్యడం నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పిన రష్మీ.. ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు ఆమె షూటింగ్ లో పాల్గొనడానికి షో లు లేవు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి.
దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటుంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా మళ్ళీ మీరెప్పుడు షో లలో పాల్గొంటారు అని రష్మీని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి రష్మీ బదులిస్తూ… ” మాకు కుటుంబాలు ఉన్నాయి, ప్రేమ అభిమానాలు, బాధ్యతలు వంటివి మాకు ఉన్నాయి. ఊరికే మేము ప్రాణాల మీదికి తెచ్చుకోలేము కదా. దయచేసి మమ్మల్ని బ్రతకనివ్వండి.