బంపర్ ఆఫర్ కొట్టిన యాంకర్ రష్మీ

  • December 9, 2019 / 08:26 AM IST

హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ప్రయత్నించి వెనుదిరిగి.. యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చి భీభత్సమైన స్టార్ డమ్ సంపాదించుకొంది “రష్మీ”. హాట్ యాంకర్ గా ఆమె సాధించిన పాపులారిటీ చూసి స్టార్ హీరోయిన్లు సైతం విస్తుబోయారు. “గుంటూరు టాకీస్, అంతం” లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ నటీనటులు ఎవరూ లేకపోయినా.. భారీ స్థాయి ప్రారంభ వసూళ్లు సాధించిందంటే ఏకైక కారణం రష్మి గ్లామర్. ఆ తర్వాత డబ్బుల (ఈ విషయాన్నే ఆమే ఒప్పుకొన్నారు) కోసం వరుసబెట్టి సినిమాలు చేసినప్పటికీ.. అవన్నీ డిజాస్టర్స్ గా నిలవడంతో రష్మీ కొన్నాళ్లు సినిమాల నుండి బ్రేక్ తీసుకొంది.

ప్రస్తుతం తెలుగులో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న రష్మీ.. నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలో అవకాశం దక్కించుకొందని తెలుస్తోంది. బోయపాటి-బాలకృష్ణల క్రేజీ కాంబినేషన్ లో ఇటీవల మొదలైన సినిమాలో రష్మీ ఒక కీలకపాత్ర పోషించనుంది. కథను కీలక మలుపు తిప్పే ఈ పాత్రకు గ్లామర్ డోస్ కూడా అవసరం. అందుకే ఈ సినిమాలో యాంకర్ రష్మీని తీసుకొన్నారని వినికిడి. ఇదేగనుక నిజమైతే రష్మీ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus