Anchor Rashmi : రేపు అమ్మానాన్నల అవసరం లేకపోతే వాళ్ళని కూడా చంపేస్తారా..? : యాంకర్ రష్మీ
- January 20, 2026 / 04:37 PM ISTByFilmy Focus Desk
మల్లెమాల ప్రొడక్షన్ ఆధ్వర్యంలో తెలుగు టివి స్క్రీన్ పై ఒక రేంజ్ లో హిట్ అయిన కామెడీ షో ‘జబర్దస్త్’. ఆ షో ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు కూడా చాలా మంది నటులుగా పరిచయం అయ్యారు. ఆ షో లో యాంకర్ గా మరియు సినిమా పాత్రలలో నటిస్తూ అందరికి బాగా సుపరిచితమైన వ్యక్తి రష్మీ. నిన్న ప్రెస్ క్లబ్ హైదరాబాద్ వేదికగా స్ట్రీట్ డాగ్స్ మాస్ కిల్లింగ్ పై ఒక ప్రెస్ మీట్ నిర్వహణ జరుగగా అందులో నటి రేణుదేశాయ్ తో పాటు రష్మీ కూడా పాల్గొన్నారు. తను ఈ సమస్య పై ఈ కింది విధంగా మాట్లాడారు.
Anchor Rashmi
స్ట్రీట్ డాగ్స్ మాస్ కిల్లింగ్ ద్వారా సమాజానికి ఏం తెలియజేద్దాం అనుకుంటున్నారని, ఈ తరం పిల్లలు, మా తాత మా నాన్న 300 కుక్కలని చంపారు కదా మేము ఒక మనిషిని చంపితే తప్పేంటి అనే ఆలోచనలలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు రష్మీ. అయినా ఈ వీధి కుక్కలను చంపటం మాత్రమే పరిష్కారం కాదన్నారు. మన దేశంలో చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని మర్చిపోవద్దు అని, ఒకప్పుడు మన పూర్వికులు ఇంట్లో చేసే మొదటి రెండు చపాతీలు ఆవులకి, చివర్లో చేసే రెండు చపాతీలు కుక్కలకి పెట్టేవాళ్ళని ఇప్పుడు ఆ సంప్రదాయం ఎక్కడికి పోయింది అన్నారు. అదే విధంగా ఆడవారి వస్త్ర ధారణ మీద పెట్టె శ్రద్ధ మూగజీవాలపై పెడితే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. మొదటి నుంచే యానిమల్ బర్త్ కంట్రోల్ మీద శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదని, ఇబ్బంది పెట్టె స్ట్రీట్ డాగ్స్ కి మున్సిపల్ షెల్టర్లు ఎక్కడ ఉన్నాయని మాట్లాడారు ఆమె.ఇంట్లో అమ్మానాన్నలతో అవసరం లేకపోతె వాళ్ళని చంపుకుంటామా ? అని చెప్పుకొచ్చారు.

చివరగా వినయంగా ప్రతి మీడియా పర్సన్ ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ మీరు రాసే హెడ్ లైన్స్ లో జనాలకి వీధి కుక్కలపై అవగాహన కలిగేలా రాయమని చెప్పారు రష్మీ. అంతకు ముందు మాట్లాడిన రేణు దేశాయ్ రిపోర్టర్స్ ప్రశ్నలకి కోపంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ వీధి కుక్కల సమస్యకు పుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో అర్ధం కావట్లేదు అంటున్నారు నెటిజన్లు.















