Rashmi: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ.. ఏం జరిగిందంటే?

బుల్లితెర స్టార్ యాంకర్లలో ఒకరైన రష్మీ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి దాదాపుగా పది సంవత్సరాలు అయినా ఇప్పటికీ తన యాంకరింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో రష్మీ పెళ్లి పార్టీ పేరుతో ఒక ఈవెంట్ ప్రసారం కానుండగా ఆ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోలు తాజాగా విడుదలయ్యాయి. ప్రోమోలో నన్ను ఎందుకు పిలిచావ్ అని ఆది అడగగా నా పెళ్లి పార్టీ అని రష్మీ చెబుతుంది.

హైపర్ ఆది వెంటనే నీకు ఫార్టీ అంటే నమ్ముతాం కానీ పార్టీ అంటే నమ్మలేం అంటూ కామెంట్ చేస్తాడు. బాబా భాస్కర్. అమ్మ రాజశేఖర్ ప్రోమోలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. ఆ తర్వాత రష్మీ చమ్మక్ చంద్ర కాళ్లు మొక్కి మగాడు చాలా గొప్పోడని ఆడపిల్లకు తాళి కట్టి ఆలిని చేస్తాడని తన పక్కనే పడుకోవడానికి చోటు ఇస్తాడని సంవత్సరం తిరగకుండానే చంకలోకి బిడ్డను ఇస్తాడని ఒకింత బోల్డ్ కామెంట్స్ చేశారు.

బాబా భాస్కర్ వెంటనే రష్మీ వేరే లెవెల్ లో చెప్పింది కానీ నవ్వు రాలేదంటూ పంచ్ లు వేశారు. ఆ తర్వాత చమ్మక్ చంద్ర మగాడంటే నీకు చిన్న గౌరవం ఉందని అనుకున్నానని కానీ ఇంత గౌరవం ఉందని నాకు తెలియదని చెప్పగా రష్మీ వెంటనే పిచ్చి ప్రాణమండి మగాళ్లంటే నాకు అని ఆమె అన్నారు. ఇంత అభినయం ఏ ఎపిసోడ్ లో చూడలేదని చంద్ర కామెంట్ చేయగా పేమెంట్ బట్టి పర్ఫామెన్స్ ఉంటుందని రష్మీ కామెంట్ చేశారు.

ఈ ప్రోమోకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. డిసెంబర్ నెల 31వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రతి సంవత్సరం ఈటీవీ డిసెంబర్ నెల 31వ తేదీన ఇలాంటి ఈవెంట్లను ప్రసారం చేస్తోంది. ప్రోమోలో సుధీర్ ఉండి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రష్మీ (Rashmi) రియల్ లైఫ్ లో పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus