Rashmi: నేటిజన్ ప్రశ్నలకు షాకింగ్ రిప్లై ఇచ్చిన రష్మీ!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై యాంకర్ గా వరుస కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈమె పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే. ఎవరైనా మూగజీవాలను కానీ వీధి కుక్కలని గాని హింసిస్తే వెంటనే రియాక్ట్ అవుతూ తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ ఉంటారు.

ఇలా మూగజీవాలకు హాని చేసే వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా రష్మీ జంతువులపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు రెచ్చిపోయి మరి చిన్నపిల్లలపై దాడి చేస్తూ వారిని చంపేస్తున్న ఘటనలు తెలంగాణలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.గతంలో ఓ చిన్నారిని చంపిన సమయంలో రశ్మిపై తీవ్ర నెగెటివిటీ ఏర్పడింది తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది.

హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న వీధి కుక్కల ఘటనలో మరో చిన్నారి మరణించారు. అయితే దీని ప్రభావం ఇప్పుడు యాంకర్‌ రష్మిపై పడింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రశ్మిని ట్యాగ్‌ చేస్తూ దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు నెటిజన్లు. ఈ న్యూస్‌ చూశారా మేడం. మీరుజంతు ప్రేమకులు కాదనడం లేదు, నిత్యం కార్లలో బంగ్లాలో ఉండే మీకు ఏం తెలుస్తుంది.

మీకు వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడానికి డబ్బు ఉంది. కానీ ఆ చిన్నారి తండ్రి రోడ్డుపై ఇయర్ రింగ్స్ అమ్ముకుంటూ బ్రతికేవారు.ఒక సినిమా ఫెయిల్యూర్ అయితేనే మీరు ఎంతో విలవిలలాడిపోతారు. అలాంటిది కన్న కొడుకు మరణిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకేం తెలుస్తుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరి కొందరు ఆ బాబు కుటుంబానికి తక్షణ సహాయం చేయాలి అంటూ కూడా రష్మిని టాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా నేటిజన్స్ చేసిన కామెంట్లపై స్పందించిన (Rashmi) రష్మి మీరు తప్పుగా ట్యాగ్ చేశారని తానేమి ప్రభుత్వాన్ని కాదు డబ్బు మంజూరు చేయడానికి అంటూ కామెంట్లు చేశారు.నిజానికి నేను చేయగలిగినంత కుక్కలకు క్రిమిరహితం చేయడానికి వ్యక్తిగత డబ్బుని ఉపయోగిస్తున్నా అని తెలిపింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus