NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకెక్కడం సంచలనం సృష్టించింది. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్టీఆర్. దీనిపై సోమవారం నాడు విచారణ జరిగింది. జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఆధ్వర్యంలో విచారణ జరిగింది.

NTR

సోషల్ మీడియాలో అలాగే ఇ-కామర్స్ సైట్లలో ఎన్టీఆర్ హక్కులకు భంగం కలిగించేలా పోస్టులు చేసేవారిని వెంటనే శిక్షించాలని,అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె.సాయిదీపక్ కోరారు. వారి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన న్యాయస్థానం.. 2021 ఐటీ చట్టం ప్రకారం ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న సైట్లు,సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకునేలా ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.

అయితే ముందుగా ఎన్టీఆర్ పై ఉన్న అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆ సోషల్ మీడియా ఖాతాలకు కూడా జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సూచించారు. ఆ తర్వాతే న్యాయస్థానం వద్దకు రావాలని ఎన్టీఆర్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్, అక్కినేని నాగార్జున కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారితో పాటు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి స్టార్స్ కూడా కోర్టుకెక్కారు.

ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అతని పేరు దగ్గరనుండి ఒకప్పుడు అతని లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్, అతని ఫ్యామిలీ లైఫ్.. ఇలా అంశాన్ని తీసుకుని కొంతమంది ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తుంటారు.

నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus