సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది ‘అతడు’. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 2వ సినిమా ఇది. 2005 ఆగస్టు 10న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా థియేట్రికల్ సక్సెస్ సాధించినప్పటికీ.. బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సాధించింది. ఎన్ని సార్లు టీవీల్లో టెలికాస్ట్ చేసినా ఆడియన్స్ చూస్తూనే వచ్చారు.
అందుకే మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు.ఈ సినిమాలో కామెడీ, యాక్షన్. లవ్, ఫ్యామిలీ వాల్యూస్, మంచి పాటలు.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉంటాయి… బాగుంటాయి.అందుకే ‘అతడు’ సినిమా శాటిలైట్ హక్కులను ‘స్టార్ మా’ వారు ఏకంగా 12 ఏళ్ళ పాటు రెన్యూవల్ చేసుకుంటూ వచ్చారు. అయితే దాదాపు ఏడాదిన్నర నుండి ‘అతడు’ సినిమా ‘స్టార్ మా’లో టెలికాస్ట్ అవ్వడం లేదు.
అందుకు కారణం లేకపోలేదు.. ‘అతడు’ శాటిలైట్ హక్కుల రెన్యూవల్ ఫీజ్ మేకర్స్ ఎక్కువ చెబుతున్నారట. అందువల్ల ‘స్టార్ మా’ సంస్థ ఆలోచనలో పడింది. ‘అతడు’ సినిమా రీ- రిలీజ్లో అద్భుతాలు చేయకపోవడానికి కారణం ఇదే. 1500 సార్లు టీవీల్లో టెలికాస్ట్ అయిన తరువాత.. అదే సినిమా కోసం జనాలు థియేటర్ కి వెళ్లి చూడడానికి సహజంగానే ఇంట్రెస్ట్ చూపించరు. ‘అతడు’ విషయంలో అదే జరిగింది.
మరోపక్క ‘స్టార్ మా’ వారు కూడా ‘అతడు’ రైట్స్ రెన్యూవల్ ఫీజ్ ఎక్కువ అని భావించడంతో.. ‘జీ’ వారిని అప్రోచ్ అయ్యింది టీం. రెండు,మూడు సిట్టింగుల్లో ‘జీ’ సంస్థ ‘అతడు’ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. ఇక నుండీ ‘జీ తెలుగు’ అలాగే ‘జీ సినిమాలు’ ఛానల్స్ లో ‘అతడు’ టెలికాస్ట్ అవుతుంది.