సుమ(Suma Kanakala) కొడుకు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చింది. కమర్షియల్ గా కూడా అది గట్టెక్కలేదు. ‘బబుల్ గమ్’ సినిమా ప్రమోషన్స్ బడ్జెట్ అంతా సుమ పెట్టుకున్నారు. స్టార్స్ అంతా తలో చేయి వేసి ‘బబుల్ గమ్’ని ప్రమోట్ చేశారు. డైరెక్టర్ రవికాంత్ కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడే. అయినా ఫలితం దక్కలేదు.
కంటెంట్ ఓకే ఓకేగా ఉన్నప్పటికీ.. ‘బబుల్ గమ్’ సినిమా రాంగ్ టైంలో రిలీజ్ అయ్యింది. దానికి ముందు వారం ‘సలార్’ సినిమా రిలీజ్ అయ్యింది. దానికి హిట్ టాక్ వచ్చింది. అయినా ‘బబుల్ గమ్’ని దించారు. కానీ ఆడియన్స్ దాన్ని పట్టించుకోలేదు.రోషన్ రెండో సినిమాగా ‘మోగ్లీ’ రూపొందింది. ‘కలర్ ఫోటో’ వంటి నేషనల్ అవార్డు సినిమా తీసిన సందీప్ రాజ్ దర్శకుడు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఈ సినిమా విషయంలో కూడా రోషన్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అవేంటంటే.. ‘మోగ్లీ’ కి ముందు వారం ‘అఖండ 2’ రిలీజ్ కావాలి. కానీ అది వాయిదా పడింది. ఒకవేల దీని తర్వాతి వారం అంటే డిసెంబర్ 19న రిలీజ్ అయినా ‘మోగ్లీ’ కి ఇబ్బందే. దీని ప్రమోషన్స్ కి కూడా ప్రభాస్, నాని వంటి స్టార్స్ తలో చేయి వేశారు.
అయినా బజ్ క్రియేట్ కాలేదు. మరోపక్క ఈ సినిమాలో విలన్ గా బండి సరోజ్ నటించాడు. అతనికి చిత్ర బృందానికి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. అవెలా ఉన్నా సినిమాలో హీరో రోషన్ కంటే అతని నటనే హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. సినిమా హిట్టయినా అతనికే క్రెడిట్ వెళ్ళిపోతే.. రోషన్ కి కలిసొచ్చేది ఏమీ ఉండదు. సో ఇలాంటి అడ్డాకులన్నీ దాటితేనే రోషన్ కనీసం పాస్ మార్కులు వేయించుకోగలడు. లేదు అంటే కష్టమే..!