యాంకర్ రవి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తప్పు చేసినందుకు కాదు తప్పుడు మాటలు పడి విసిగిచేంది పోలీసుల్ని ఆశ్రయించాడు. విషయంలోకి వెళ్తే… సోషల్ మీడియాలో తన పై,అలాగే తన కుటుంబ సభ్యుల పై పరుష పదజాలం ఉపయోగించి దాడి చేసిన నెటిజన్లను వదిలిపెట్టేది లేదని యాంకర్ రవి అల్టిమేటం జారీ చేసాడు. తనకి ఎదురైన ఈ చేదు అనుభవం ఇంకెవ్వరికీ ఎదురవ్వకూడదని… ఇలాంటి పరుష పదాలతో దూషించకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు…,
ఇలాంటివి అంతం చేయడానికి ఇదో కొత్త ఆరంభం మాత్రమే అంటూ యాంకర్ రవి తెలిపాడు. లిఖిత పూర్వకంగా రాసిన ఫిర్యాదుని యాంకర్ రవి ఫోటో రూపంలో షేర్ చేసాడు. రవి మాటల్లో… “ఎదుటి వారి పరువుకి మర్యాదకి నష్టం కలిగించేలా ఇన్ స్టా, ఎఫ్ బీ, ట్విట్టర్ ఖాతాలు, యూట్యూబ్ రివ్యూలు ఇచ్చిన వారందరి పై ఫిర్యాదు చేశాను. ఫేక్ సమాచారాన్ని, పరుష పదజాలంతో నెగెటివిటీని ప్రచారం చేసిన వారి పై ఫిర్యాదు చేశాను.
కచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకుంటారని భావిస్తున్నాను. ఇక నుండీ తప్పు మాట మాట్లాడాలి..తప్పు మాట టైప్ చేయాలంటే భయం పుట్టాలి. సైబర్ క్రైమ్ పోలీసులకు నా ప్రత్యేక ధన్యావాదాలు” అంటూ యాంకర్ రవి పోస్ట్ పెట్టాడు. తాను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు రవి ఫ్యామిలీ పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రవి తల్లి, భార్య ఆఖరికి అతని పాప పై కూడా ఘోరమైన కామెంట్లు చేశారు.ఈ విషయం హౌస్ లో ఉన్నందుకు గాను రవికి తెలియనివ్వలేదు.
ఒకవేళ హౌస్ లో ఉండగా అతనికి తెలిస్తే మరింత ఎమోషనల్ అయ్యి.. డిస్టర్బ్ అయ్యి అతని గేమ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని భావించి రవి ఇంట్లో వాళ్ళు అతనికి తెలియజేయలేదు.బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక.. ఈ విషయం తెలుసుకుని ఏ కంటెస్టెంట్ అభిమానులు ఇలా చేసారో తెలుసుకుని రవి కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.