బుల్లితెర మేల్ యాంకర్స్ లో ప్రదీప్, రవి కి మంచి క్రేజ్ ఉన్నసంగతి తెలిసిందే. వీరిలో ప్రదీప్ కు ఎలాగు పెళ్ళవ్వలేదు. ఇక రవికి పెళ్లైందా అనే డౌట్ చాలా మందికి ఉంది. ఇక రవి కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ బయట్టలేదు అని అందరూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే కొన్ని నెలల క్రితమే తన కుటుంబాన్ని అందరికీ పరిచయం చేసాడు రవి. ‘నేను కూడా ఓ ఫ్యామిలీ పర్సన్ నే’ అంటూ తన కుటుంబాన్ని పరిచయం చేశాడు రవి.
తన భార్య నిత్య సక్సేనాతో పాటు మూడేళ్ళ పాపను కూడా పరిచయం చేస్తూ ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లలో పోస్ట్ చేశాడు. తాజాగా మరోసారి తన కుటుంబానికి సంబందించిన ఫోటోలను షేర్ చేశాడు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి: