NTR Rejected Movies: తన 20 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ‘బాల రామాయణం’ చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆ చిత్రం సమయంలో ‘నందమూరి ఫ్యామిలీకి ఇతను దేవుడు ప్రసాదించిన వరం.. భవిష్యత్తులో ఇతను కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడు అని అనుకున్నారట ఆ చిత్రం దర్శక నిర్మాతలు. వారు ఆరోజు.. ఎన్టీఆర్ లో ఏం చూసి అనుకున్నారో తెలీదు కానీ… ఈరోజున మాత్రం ఎన్టీఆర్ నిజంగానే పెద్ద స్టార్ అయ్యి కూర్చున్నాడు.

ఇతను క్విక్ లెర్నర్, ఎనర్జిటిక్, డైలాగ్ కింగ్, సూపర్ డ్యాన్సర్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఇతనిలో ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘ఆది’ ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో తిరుగులేని మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాదు అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి వారిని కూడా భయపెట్టేసాడు. ఎన్ని పరాజయాలు ఎదురైనా ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా లోపాలను తెలుసుకుని… వాటిని సరిదిద్దుకుని మరీ హిట్లు అందుకున్నాడు మన తారక్. ‘రాఖీ’ ‘యమదొంగ’ ‘అదుర్స్’ ‘టెంపర్’ వంటి చిత్రాల్లో అతని నటనకు ఎవరైనా హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే.

అయితే ఎందుకో ఎన్టీఆర్ వదిలేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి కొన్ని ప్లాప్ అయ్యాయి. ఇక్క ప్లాప్స్ ను పక్కన పెట్టేసి హిట్టు సినిమాలను మాత్రం ఎందుకు రిజెక్ట్ చేసాడు.. కాల్ షీట్స్ లేక వదిలేసాడా.. కథ నచ్చక వదిలేసాడా.. లేక ఆ క్యారెక్టర్ మనకి సెట్ ఎవ్వడు అని వదిలేసాడా? అన్న విషయాలు తెలీదు కానీ, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన అన్ని సినిమాలను ఓ లుక్కేద్దాం రండి.

1) దిల్

నితిన్ హీరోగా వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముందుగా ప్రభాస్ తో తెరకెక్కించాలి అనుకున్నాడు వినాయక్. అతను రిజెక్ట్ చేసే సరికి ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యాడు. ‘ఆది’ వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కదా ని చెప్పాడు అనుకుంటే.. అతను రిజెక్ట్ చేసాడు. తరువాత నితిన్ చేస్తే సూపర్ హిట్ అయ్యింది.

2) ఆర్య

ఈ చిత్రానికి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సుకుమార్ కథని ప్రభాస్ రిజెక్ట్ చెయ్యక ఎన్టీఆర్ వద్దకు వెళ్ళాడు సుకుమార్. అప్పట్లో ఎన్టీఆర్ కొంచెం బొద్దుగా ఉండేవాడు .. దాంతో ఈ క్యారెక్టర్ కు నేను సెట్ అవ్వను అని వదిలేసాడట. కట్ చేస్తే అది అల్లు అర్జున్ చెయ్యడం బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.

3) అతనొక్కడే 

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కథను మొదట ఎన్టీఆర్ కు చెప్పగా అతను రిజెక్ట్ చేసాడట. కానీ తరువాత కళ్యాణ్ రామ్, జానకి రామ్ లు స్వయంగా నిర్మించి బ్లాక్ బస్టర్ దక్కించుకున్నారు. కళ్యాణ్ రామ్ కు ఇది మొదటి హిట్ చిత్రం.

4) భద్ర 

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సహాయ రచయితలు గా కొరటాల శివ, వంశీ పైడిపల్లి పనిచేసారు. వారు ఈ కథకి ఎన్టీఆర్ అయితే బెటర్ అని చెప్పారట. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసాడు. తరువాత అల్లు అర్జున్ కు చెబితే అతను కూడా రిజెక్ట్ చేసాడు. చివరికి రవితేజ చెయ్యడం సూపర్ హిట్ అందుకోవడం జరిగింది.

5)కృష్ణ

రవితేజ సూపర్ హిట్ చిత్రాలలో ఇది కూడా ఒకటి. దర్శకుడు వినాయక్ ఈ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ తో తియ్యాలి అనుకున్నారు. దానికి ‘కత్తి’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చెయ్యడం .. తరువాత దర్శకుడు గుణశేఖర్ కూడా ఈ టైటిల్ తనది అని వినాయక్ ను రిక్వెస్ట్ చెయ్యడంతో … అది ‘కృష్ణ’ గా రవితేజ తో తీసి హిట్ కొట్టారు వినాయక్.

6)కిక్ 

సురేందర్ రెడీ ఈ కథని మొదట ప్రభాస్ కు చెప్పాడట. కానీ అతను నో చెప్పడంతో రచయిత వక్కంతం వంశీ ఎన్టీఆర్ కు కూడా వినిపించాడట. రవితేజ 10 కోట్ల మార్కెట్ ను 25 కోట్లకు పెంచిన ఈ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసాడని తెలుస్తుంది.

7) ఎవడు 

రాంచరణ్, అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం ఎబౌవ్ యావరేజ్ గా ఆడింది. అయితే ముందుగా ఈ కథని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు చేద్దాం అనుకున్నారట. కానీ ఎందుకో డ్రాప్ అయ్యారు.

8)శ్రీమంతుడు 

కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. అంతేకాదు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కూడా. ఈ కథను ఎన్టీఆర్ కు చెప్తే రిజెక్ట్ చేసాడు. తరువాత చరణ్ కూడా వద్దనుకున్నాడు. చివరికి అది మహేష్ వద్దకు వెళ్ళింది.

9) ఊపిరి 

వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీ పాత్రకు ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నాడు దర్శకుడు వంశీ. కానీ ఎన్టీఆర్ స్క్రిప్ట్ ల్లో మార్పులు కావాలి అన్నాడట. దాంతో ఇది కార్తీ వద్దకు వెళ్ళింది.

10) బ్రహ్మోత్సవం

ఎన్టీఆర్ చేసిన గొప్ప పని ఏమైనా ఉందా అంటే.. ఇది మొదటిగా చెప్పుకోవాలి. అదే ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని రిజెక్ట్ చెయ్యడం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదట ఈ కథని ఎన్టీఆర్ కు చెప్పాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే వరకూ వెళ్ళింది. కానీ ‘ముకుంద’ రిజల్ట్ అలాగే అప్పుడు ఎన్టీఆర్ కూడా ‘రామయ్య వస్తావయ్యా’ ‘రభస’ డిజాస్టర్లతో మనసు మార్చుకుని ‘బ్రహ్మోత్సవం’ ను పక్కన పెట్టేసి అదే నిర్మాత తో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం చేసాడు.

11) నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా 

వక్కంతం వంశీ డైరెక్టర్ గా మారి అల్లు అర్జున్ తో చేసిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. నిజానికి మొదట ఈ కథని ఎన్టీఆర్ కు చెప్పాడు దర్శకుడు అండ్ రైటర్ అయిన వక్కంతం వంశీ. కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ముందుకు వచ్చారు. కానీ కథ నచ్చకపోవడంతో ‘జై లవ కుశ’ ను ఓకే చేసి.. వక్కంతం వంశీ కథను పక్కన పెట్టారట. అలా అది కొన్ని మార్పులు చేసిన తరువాత అల్లు అర్జున్ తో తెరకెక్కించాడని తెలుస్తుంది.

12) శ్రీనివాస కళ్యాణం 

ఇది ఎన్టీఆర్ చేసిన రెండో గొప్ప పని అని చెప్పాలి . దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ముందుగా ఎన్టీఆర్ తో ప్లాన్ చేశారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసాడని తెలుస్తుంది.

Share.