Ravi: యాంకర్ రవి గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టిన అతని భార్య..!

  • April 16, 2021 / 06:16 PM IST

బుల్లితెర పై స్టార్ యాంకర్ గా కొనసాగుతోన్న వారిలో యాంకర్ ప్రదీప్ తరువాత రవి నే ఉంటాడు.మాస్ ఆడియెన్స్ కు రవి పంచ్ డైలాగులు బాగా కనెక్ట్ అవుతాయి. ‘స్టార్ మా’.. ‘మా టీవీ’ గా పిలవబడుతున్న రోజుల్లో ఓ షోలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు రవి.అటు తరువాత ‘పటాస్’ వంటి షో తో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకున్నాడు. అయితే ఎఫైర్స్ విషయంలో రవి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.

గతంలో ఓ యాంకర్ తో ఇతను ప్రేమాయణం నడిపాడని.. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదు అని అతను చెప్పినప్పటికీ అవి ఆగలేదు. అయితే ఓ రోజు సడన్‌గా తన భార్య నిత్య సక్సేనా అలాగే తన కూతురిని పరిచయం చేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల రవి స్టార్ యాంకర్ సుమతో కలిసి హోస్ట్ చేస్తున్న ‘బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్’ కు అతని భార్య సడెన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది.

దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఆదివారం నాడు ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇక ఈ ప్రోమోలో రవి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలను అతని భార్య నిత్య బయటపెట్టేసింది. ‘చాలా సార్లు తెల్లవారు జామున 3 గంటలకు ఇంటికి వచ్చి.. షూటింగ్ వల్ల లేటయ్యింది అని చెప్తాడట. అంతేకాకుండా రవి ఫోన్ పాస్ వర్డ్ కూడా తనకి తెలీదని.. తెలిస్తే అందులో ఎలాంటివి ఓపెన్ చేసి చూడాల్సి వస్తుందో అని భావించి తెలుసుకోలేదని’ నిత్య చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus