బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఎవిక్షన్ పాస్ కోసం ఫైట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఇద్దరు పార్టిసిపెంట్స్ ఈ పాస్ కోసం పోటీ పడేందుకు ఎంపిక అయిన సంగతి తెలిసిందే. మూడో టాస్క్ లో భాగంగా యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. రవి రాకతో హౌస్ మేట్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. రవి అందర్నీ పలకరిస్తూ బయట ఎవరిది ఏ విషయంలో ప్లస్ అయ్యింది. ఏ సంఘటనలు వైరల్ అవుతున్నాయి అనేది చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ తమ గేమ్ పట్ల ఒక అంచనాకి వచ్చారు. ఇక మిస్టరీ బాక్స్ కోసం టాస్క్ ఆడించాడు రవి. ఈసారి ఎలాగైనా సరే పోటీదారులు అవ్వాలనే కసితో ఉన్న యాంకర్ శివ, ఇంకా అఖిల్ ఇధ్దరూ పోటా పోటీగా గేమ్ ఆడారు. నటరాజ్ మాస్టర్, బాబాభాస్కర్ ఒకవైపు టఫ్ ఫైట్ ఇస్తున్నా కూడా ఇద్దరూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా గేమ్ ఆడారు. ఫస్ట్ టాస్క్ లో గెలిచి మిస్టరీ బాక్స్ ని అందుకున్నాడు శివ. దీంతో అసలు సిసలైన సెకండ్ టాస్క్ అనేది స్టార్ట్ అయ్యింది.
చేతుల సహాయం లేకుండా నడుముకి రోప్ కట్టుకుని ఆ రోప్ ని తీసుకుని వచ్చి వేరే చోట చుడుతూ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఇది చేసేందుకు హౌస్ మేట్స్ ముప్పతిప్పలు పడ్డారు. చాలాసేపు అఖిల్, శివ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ ఆడారు. లాస్ట్ మినిట్ లో యాంకర్ శివ విన్నర్ గా నిలిచాడు. ఎప్పటిలాగానే శివ మిస్టరీ బాక్స్ ని నీకోసం వాడతావా, లేదా వేరేవాళ్లకి ఇస్తావా అని బిగ్ బాస్ అడిగాడు. దీంతో శివ ఇది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా కూడా తనకోసమే వాడతాను అంటూ చెప్పాడు. ఇక్కడే శివ కొద్దిగా ఆలోచించాల్సింది. కానీ, శివ మిస్టేక్ చేశాడు. అంతకుముందు నటరాజ్ మాస్టర్ కి మిస్టరీ బాక్స్ వల్ల ఒక ర్యాంక్ వెనక్కి వెళ్లాడు కాబట్టి, ఈసారి పాజిటివ్ వస్తుందని అనుకున్నాడు. కానీ, శివకి వేరేవాళ్ల ర్యాంక్ తో స్వాప్ చేసుకోమని వచ్చింది. వేరేవాళ్లు అందరూ జీరోలో ఉన్నారు. శివ మాత్రమే ఒక్కపాయింట్ తో ముందుకున్నాడు. దీంతో స్వాప్ చేసుకోవాల్సి వస్తే, గేమ్ ఓడిపోయినట్లే అవుతుంది. ఇక చేసేది ఏమీ లేక బిందుకి అవకాశం ఇచ్చాడు.
అయితే, శివ ఫ్రెండ్షిప్ మీద ఇస్తే బాగుండేది కానీ, నాలుగైదు మాటలు అనేసరికి బిందు ఈ స్వాప్ ని తిరస్కరించింది. కాసేపు శివ బ్రతిమిలాడు సారీ చెప్పి మరీ బిందుకి అవకాశం ఇచ్చాడు. దీంతో మూడో పోటీదారులుగా బిందు నిలిచింది. నిజానికి మిస్టరీ బాక్స్ టాస్క్ లో బిందు అఖిల్ తో కలిసి గేమ్ చాలా బాగా ఆడింది. అందుకే, శివ తన ఫ్రెండ్ అయిన బిందుతో స్వాప్ చేసుకుని బిందుకి అవకాశం ఇచ్చాడు. అదీ మేటర్.