బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం నామినేషన్స్ వేడెక్కాయి. ఈసారి నామినేషన్స్ ప్రక్రియని విభిన్నంగా పెట్టాడు బిగ్ బాస్. హౌస్ లో ఒక ట్రక్ పెట్టాడు. బజర్ మోగినప్పుడల్లా ఎవరైతై లివింగ్ రూమ్ లో ఉన్న హారన్ ని ముందుగా పట్టుకుంటారో వాళ్లు ట్రక్ డ్రైవర్ అవుతారు. మిగతా వాళ్లు పాసింజర్స్ అవుతారు. ట్రక్ డ్రైవర్ ఇద్దరిని నామినేట్ చేసేందుకు కారణాలు చెప్పి ఎంచుకుంటే, వారిలో ఒకర్ని పాసింజర్స్ అందరూ ఏకాభిప్రాయంతో సేవ్ చేస్తారు.
ఒకరు నామినేట్ అవుతారు. ఇంకొకరు సేఫ్ అవుతారు. ఇక్కడే ఫస్ట్ రెండు రౌండ్స్ లో నటరాజ్ మాస్టర్ శివని టార్గెట్ చేశాడు. ఫస్ట్ శివ ఇంకా బిందు ఇద్దరినీ ఎంచుకున్నాడు. బిందు శివతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వరుసగా చెప్పిన తర్వాత హౌస్ మేట్స్ బిందుని నామినేట్ చేశారు. ఆ తర్వాత అన్నా చెల్లి వార్ అనేది స్టార్ట్ అయ్యింది. మరోసారి హారన్ ని పట్టుకున్న నటరాజ్ మాస్టర్ శివని ఇంకా మిత్రాశర్మాని ఎంచుకున్నారు. ఇక్కడే మిత్రా శర్మా శివతో గట్టిగా ఆర్గ్యూ చేసింది.
అన్నయ్యా అని అన్నావ్ కానీ నీకు ఆ ఫీలింగ్ లేదు అంటూ శివ వాదించాడు. చెల్లెమ్మా అని అన్నాను కానీ, అన్నయ్యా అని నీసైడ్ నుంచీ రావట్లేదు, పైగా బిందుతో మాట్లాడద్దని, ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు అని అన్నావ్ అని శివ మిత్రాని లాక్ చేశాడు. దీంతో మిత్రా తన ఉద్దేశ్యం ఏంటి అనేది క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసింది. ఒకటే విషయాన్ని పదిసార్లు చెప్తూ హౌస్ మేట్స్ కి విసుగు తెప్పించింది. ఇక శివ నువ్వే నన్ను నామినేట్ చేశావని, ఫేక్ అని వేశావ్ అని బాధపడ్డాడు.
తన పాయింట్ ని గట్టిగా వాదించాడు. హౌస్ మేట్స్ ఓటింగ్ కి వెళ్లినపుడు ఇద్దరి మద్యలో డ్రా అయ్యింది. అయితే, ఇక్కడే మహేష్ విట్టా తన ఓట్ ని ఛేంజ్ చేసి శివని సేఫ్ చేశాడు. దీంతో మిత్రా నామినేట్ అయ్యింది. ఫస్ట్ రౌండ్ లో బిందుమాధవి, తర్వాత రౌండ్ లో మిత్రాశర్మా, మూడోరౌండ్ లో అనిల్ నామినేట్ అయ్యాడు.
ఇక్కడే నటరాజ్ మాస్టర్ శివని గట్టిగా టార్గెట్ చేశాడు నటరాజ్ మాస్టర్. తను హారన్ పట్టుకున్న ప్రతిసారి శివని నామినేట్ చేశాడు. అయితే, నటరాజ్ మాస్టర్ చెప్పిన రీజన్స్ అనేవి సరిగ్గా లేవు. మూడుసార్లు హారన్ పట్టుకుని డ్రైవర్ అయ్యారు కాబట్టి నటరాజ్ మాస్టర్ నాలుగో రౌండ్ ఆడలేకపోయారు. కానీ, ఆడిన మూడుసార్లు శివని నామినేట్ చేశారు మాస్టర్.