Anchor Suma: సుమ లేకపోవడంతో బోసిపోయిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర మీద సందడి చేస్తున్న యాంకర్ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ తన మాటలతో అటు బుల్లితెరపేక్షకులను ప్రేక్షకులను ఇటు వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుమ బుల్లితెర మహారాణిగా గుర్తింపు పొందింది. ఇలా సుమ టెలివిజన్లో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో మాత్రమే కాకుండా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా తెగ సందడి చేస్తోంది.

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే కచ్చితంగా సుమ హోస్ట్ గా ఉండాల్సిందే. కార్యక్రమం మొదలైన దగ్గరినుండి పూర్తి అయ్యేవరకు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తన మాటలతో అందరిని ఆకట్టుకుంటున్న సుమ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ముఖ్యంగా ఇటీవల జరిగిన గాడ్ ఫాదర్ , ది ఘోస్ట్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ కనిపించకపోవడంతో ఆమె లేని లోటు బాగా తెలుస్తోంది.

అయితే ఉన్నట్లుండి సుమ ఇలా ఇండస్ట్రీలో కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటో తెలియాలంటే ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే సరిపోతుంది. వరుస షూటింగ్ లతో బిజీగా ఉండే సుమ షూటింగ్లకు కొంత విరామం తీసుకొని మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సుమ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

ఇలా సుమ మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేయటం వల్ల గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ వంటి సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కనిపించలేదని తెలుస్తోంది. సుమా లేకపోవడంతో సుమ స్థానంలో ఇతర యాంకర్లతో ఈ కార్యక్రమాలను ముందుకు నడిపించారు. కానీ సుమా లేకపోవడంతో ఈ కార్యక్రమాలు చాలా వెలితిగా కనిపించాయి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus