బిగ్ బాస్ 4: మజాక్ లోనే మొత్తం చెప్పింది..!

  • November 9, 2020 / 12:22 PM IST

బిగ్ బాస్ హౌస్ లో సండే వస్తే అది ఫన్ డే గానే మారుతుంది. ఫస్ట్ నుంచి నాగార్జునే హౌస్ మేట్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ వారితో గేమ్స్ ఆడిస్తుంటారు. సీజన్ – 3 లో అయితే, నాగార్జునతో సరదాగా గెస్ట్ లుగా వచ్చి స్టేజ్ షేర్ చేస్కున్న సెలబ్రిటీలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే, ఈసీజన్ లో నాగ్ లేనపుడు అక్కినేని సమంత వచ్చి సందడి చేసింది. అంతేకాదు, హైపర్ ఆదిని తీస్కుని వచ్చి హౌస్ మేట్స్ మనసులో మాటల్ని చెప్పించింది. ఇక అదే పద్దితిలో నాగార్జున కూడా మాటల తూటాలు పేల్చేందుకు, యాంకర్ సుమని ఈవారం రంగంలోకి దింపాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఆడియన్స్ లో ఉత్సుకతని రేపుతూ ఈ ఎపిసోడ్ సాగింది.

ఇక సుమ తనదైన స్టైల్లో రెచ్చిపోయింది. కేవలం హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు, నాగార్జునపై కూడా పంచ్ లు వేస్తూ చెలరేగిపోయింది. నాన్ స్టాప్ నవ్వులతో సండే ఎపిసోడ్ చించేసింది.

ఇక సుమ హౌస్ మేట్స్ ని ఇమిటేట్ చేస్తూనే, మజాక్ చేస్తూనే వారి గురించి మొత్తం చెప్పేసింది. మరి ఇది హౌస్ మేట్స్ ఫన్ వేలో ఎంతవరకూ తీసుకుంటారో తెలియదు కానీ, సుమ మాత్రం హింట్స్ ఇస్తూనే వెళ్లింది. అంతకుముందు దీపావళి గిఫ్ట్స్ ఇచ్చిన నాగ్ ఫన్ వేలో గేమ్స్ ఆడిస్తే, దీపావళికి క్రాకర్స్ మోగినట్లుగా స్టేజ్ పైన పంచ్ ల మోత మోగించింది సుమ.

అరియానాలా మిమిక్రీ చేస్తూ, సోహైల్ లా ప్రస్టేట్ అవుతూ, హారికలాగా అల్లరి చేస్తూ పంచ్ లు వేసింది. అంతేకాదు, అవినాష్ తో ఆడుకుంటే, లాస్య కుళ్లుజోకులు ఎలా ఉంటాయో చెప్పింది. అభితో ఫిజికల్ ఛాలెంజ్, మోనాల్ ముద్దుముద్దుమాటలు, అఖిల్ తో పాటలు పాడించింది. ఇక్కడే సుమ మాజాక్ చేస్తూనే హౌస్ మేట్స్ కి వాళ్ల గేమ్ ఎలా ఉంటోందో, హింట్ కూడా ఇచ్చింది. మరి ఇది ఎంతవరకూ హౌస్ మేట్స్ రిసీవ్ చేస్కుని గేమ్ స్ట్రాటజీలని మారుస్తారో చూడాలి. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus