లాక్ డౌన్ కు ముందు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది : యాంకర్ వర్షిణి

‘శంబో శివ శంభో’ ‘చందమామ కథలు’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. అయితే యాంకర్ గా అలాగే ‘పెళ్ళిగోల’ వంటి పలు వెబ్ సిరీస్ లతో మాత్రం అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకుందని చెప్పొచ్చు. తమిళమ్మాయే అయినప్పటికీ.. తెలుగులోనే బాగా క్లిక్ అయ్యింది. స్టార్ యాంకర్ గా ఎదిగింది. తాజాగా ఈ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అవుతున్నాయి. వర్షిణి మాట్లాడుతూ.. “లాక్ డౌన్ కు ముందు నాకొక వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చింది. ఒకసారి కలవాలి అని డైరెక్టర్ అంటే కథ గురించేమో అని వెళ్ళి అతన్ని కలిశాను. కాసేపు నాతో మాట్లాడాడు.తరువాత కొద్దిసేపటికి నాతో మిస్-బిహేవ్ చెయ్యడం మొదలుపెట్టాడు. అతను నా చేయి పట్టుకొని లాగాడు. అప్పుడు నేను వెంటనే బయటకొచ్చేశాను.ఆ టైములో కారులో కూర్చొని తెగ ఏడ్చాను.

నా కెరీర్ లో చేదు అనుభవం ఇదే అనిపించింది. ఇప్పటివరకూ నాకు అలా జరగలేదు.నా పేరెంట్స్ తో కూడా ఈ విషయాన్ని చెప్పుకోలేకపోయాను. కేవలం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus