ఇదేం పని వర్షిణీ.. క్రేజ్ కోసం ఇంత……!

దశాబ్ద కాలం పై నుండే స్టార్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ కనకాల. ఎన్ని టీవీ షోలకైనా.. ఎటువంటి సినిమా వేడుకలకైనా ఈమె ఉంటేనే ఓ కళ అని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. నో డౌట్ ఇప్పటికీ ఈవిడే నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఈమె తరువాత అనసూయ, రష్మీ మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఇక శ్రీముఖి కూడా వీళ్ళకి గట్టి పోటీనే ఇస్తుంది. వీళ్ళ పోటీని తట్టుకుని టాప్ ప్లేస్ కు చేరాలి అంటే ఇప్పుడు వచ్చే ఫీమేల్ యాంకర్స్ కు అంత ఈజీ కాదనే చెప్పాలి. అందుకేనేమో ఓ కుర్ర యాంకర్ అభిమాని బుగ్గను కొరికి మరీ వైరల్ అవ్వాలని భావించినట్టు ఉంది.

Anchor Varshini Sounderajan bite a fan cheek1

విషయం ఏమిటంటే.. ‘పటాస్’ షో ను తమ ప్రతిభతో పాపులర్ చేశారు శ్రీముఖి అండ్ రవి. ఇప్పుడు వీరి స్థానంలోకి ‘జబర్దస్త్’ ఫేమ్ చలాకీ చంటి, వర్షిణి లు వచ్చారు. ఇక రాబోయే ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమోని విడుదల చేశారు. ఇక షోలో భాగంగా యాంకర్లు కొన్ని ప్రశ్నలు అడిగి.. స్టూడెంట్స్ తో సమాధానాలు చెప్పేస్తుంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వారు అడిగిన ఓ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఓ అబ్బాయి నిలుచున్నాడు. ఆ సమయంలో వర్షిణి.. ‘ చాలా క్యూట్ గా ఉన్నాడు అంటూ స్టేజ్ పైకి పిలిచింది. అక్కడితో ఆగకుండా.. అతడి బుగ్గలు పట్టుకుని గిల్లడం తో పాటు… గట్టిగా ఆ కుర్రాడి బుగ్గను కోరికేసింది. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఎపిసోడ్ కు హైప్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో అలా ప్రోమోని కట్ చేసి ఉంటారు మేకర్స్. అయితే ‘క్రేజ్ కోసం ఇంత దిగజారాలా’ అంటూ వర్షిణి పై ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతుంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus