Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు?

రామ్ హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా నిన్న అంటే నవంబర్ 27న రిలీజ్ అయ్యింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. దీనికి కారణాలు లేకపోలేదు. గురువారం అంటే వీక్ డే రిలీజ్ కావడం.. పైగా అన్ సీజన్ కావడంతో మొదటి రోజు అనుకున్న రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు.

Andhra King Taluka

రామ్ గత సినిమాలు ‘ది వారియర్’ ‘స్కంద’ ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి డిజాస్టర్ సినిమాలతో పోల్చినా.. హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఓపెనింగ్స్ దాదాపు 30 శాతం తక్కువగా నమోదు అవ్వడం ట్రేడ్ పండితులకు సైతం షాకిస్తుంది.అయితే పోటీగా సినిమా లేకపోవడం, లాంగ్ వీకెండ్ వంటివి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకి కలిసొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

పోటీగా రిలీజ్ అయిన కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ వంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. సో ఇది ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి అడ్వాంటేజ్ కానుంది. 2వ రోజు దాదాపు 100 స్క్రీన్స్ పెరిగాయి. ఈరోజు హైదరాబాద్లో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీ లకు, స్కూల్స్ కి హాలిడేస్ ఉండటంతో ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో రెండో రోజు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా రూ.3 కోట్ల రేంజ్లో షేర్ ను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రేంజ్ స్టాండర్డ్ కనుక మెయింటైన్ చేస్తే.. శని,ఆది వారాల కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు.

మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus