ఏ ముహూర్తాన నరేంద్ర మోడి గుజరాత్ ఓ 3000 కోట్ల రూపాయల భారీ మొత్తం వెచ్చించి సర్దార్ వల్లబ్బాయి పటేల్ కోసం ప్రపంచంలోనే పొడవైన విగ్రహం పెట్టించాడో కానీ.. అప్పట్నుంచి అందరూ అంతకంటే ఎత్తైన లేదా అదే స్థాయిలో తమ రాష్ట్రంలోనూ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేయడం మొదలెట్టారు. అదే తరహాలో తాజాగా నవరసనటసార్వభౌమ మరియు తెలుగుదేశం పార్టీ సృష్టికర్త ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి.
కొత్త రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో చంద్రబాబు ఎలాగూ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన హయాంలోనే ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టను పూర్తి చేయాలని భావిస్తున్నారట. మరీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతటి పెద్ద విగ్రహం కాదు గానీ.. చుట్టూ గోదావరి మధ్యలో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆంధ్రులు తమ ఆత్మగొరవంగా భావించే ఈ ప్రొజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది.