ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అనీమాస్టర్ ఈవారం ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో అనీమాస్టర్ జెర్నీ ముగిసింది. ఓటింగ్ లో లీస్ట్ ఉండటం వల్ల అనీమాస్టర్ హౌస్ నుంచీ బయటికి రాక తప్పలేదు. ఫస్ట్ వీక్ నుంచీ కూడా తనదైన స్టైల్లో గేమ్ ఆడిన అనీమాస్టర్ అందర్నీ ఓవర్ టేక్ చేసుకుంటూ 11వ వారం వరకూ వచ్చింది. అంతేకాదు, టాస్క్ లలో అందరికీ ధీటుగా సమాధానం చెప్పింది. కొన్ని టాస్క్ లలో సోలోగా గెలిచి ప్రత్యేకమైన పవర్స్ ని సైతం సాధించింది. అంతేకాదు, ఇమ్యూనిటీ టాస్క్ లో కూడా సోలోగా గెలిచి ఒకవారం ఇమ్యూనిటీని సైతం పొందింది. మానస్ ని కూడా సేఫ్ చేసింది.
తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తాను అని చెప్తూనే ఎవ్వరికీ భయపడకుండా జెస్సీతో కుస్తీకి సైతం సై అంది అనీమాస్టర్. అన్ని టాస్క్ లలో 100శాతం పర్ఫామెన్స్ ఇచ్చినా అనీమాస్టర్ కి సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేకుండా పోయింది. ఇక మరోవైపు తను చెప్పే రీజన్స్ కూడా లాజిక్ లేకుండా ఉండేసరికి బిగ్ బాస్ లవర్స్ కి ఎక్కలేదు. మిగతా హౌస్ మేట్స్ ని ఇమిటేట్ చేస్తూ ప్రస్టేట్ అవ్వడం, కాజల్ విషయంలో తనని ఎక్కిరిస్తూ డ్యాన్స్ చేయడం అనేది అనీమాస్టర్ గేమ్ ని దెబ్బకొట్టాయి. ముఖ్యంగా లాస్ట్ వీక్ అనీమాస్టర్ నామినేషన్స్ అప్పుడు, టాస్క్ ఆడేటపుడు శృతిమించీ మరీ కాజల్ పైకి వెళ్లింది.
కాజల్ విషయంలో , పింకీ విషయంలో డీప్ గా హర్ట్ అయ్యింది అనీమాస్టర్. అంతేకాదు, కాజల్ ని నాగిన్ అంటూ డ్యాన్స్ చేయడం, పింకీతో ఆర్గ్యూ చేయడం, గ్రూప్ గా గేమ్ ఆడుతూనే వేరేవాళ్లని గ్రూప్ గేమ్ అనడం అనేది అనీమాస్టర్ గేమ్ ని పూర్తిగా దెబ్బతీశాయి. ఇక అనీమాస్టర్ హౌస్ లో చాలా ఎమోషనల్ జెర్నీనే చేసింది. 11 వారాల పాటు తన గేమ్ తోనే హౌస్ లో నిలబడింది. శ్రీరామ్, రవి, మానస్, జెస్సీ, షణ్ముక్, సిరిలు సపోర్ట్ చేసినా కూడా టాస్క్ లలో మాత్రం తన గేమ్ తను ఆడుకుంది. తనకి ఏది జెన్యూన్ అనిపిస్తే అదే మాట్లాడే ప్రయత్నం చేసింది. నిజానికి అనీమాస్టర్ టాప్ 5లో ఉంటుందనే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఎలిమినేట్ అయిపోడంతో హౌస్ లో తన జెర్నీ ముగించింది అనీమాస్టర్.