Anee Master Remuneration: వామ్మో యానీ మాస్టర్ కి అన్ని లక్షలు పట్టుకెళ్ళిందా..!

డ్యాన్స్‌ మాస్టర్‌గా, రియాలిటీ షోలకు జడ్జిగా వున్న యానీ మాస్టర్ ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌లో ఛాన్స్ కొట్టేసింది. తోటి కంటెస్టెంట్స్ ఆటను గమనిస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆమె తన ఆట తాను ఆడారు. దీంతో యానీకి ప్రేక్షకులు కూడా అండగా నిలిచి ఓట్లు వేసేవారు. ఈ నేపథ్యంలో టైటిల్‌తోనే ఇంటికి వెళ్తాననే కలకు ఆమె చేరువయ్యారు. అయితే ఊహించని విధంగా యానీ మాస్టర్ గత వారం ఎలిమినేట్ అయ్యారు. చివరి వరకు ప్రియాంక, యానీ మాస్టర్ ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. అయితే ప్రియాంక సేవ్ అయిపోవడంతో యానీ హౌస్‌ను వీడకతప్పలేదు.

నిజానికి వీరిద్దరిలో యానీ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్… సొంతంగా తన కోసం ఆట ఆడింది. ప్రియాంక మాత్రం తనకంటే ఎక్కువగా మానస్‌పై ఫోకస్‌ పెడుతూ తన గేమ్‌ను పక్కన పెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హౌస్‌లో తనకు ఏమైనా అవసరం ఉంటేనే మాట్లాడే యానీ.. పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్నట్లు అనిపిస్తే మాత్రం గొంతు చించుకుంటుంది. అయితే ఇటీవలి కాలంలో తోటి కంటెస్టెంట్‌ కాజల్‌ను శత్రువులాగా చూడటం.. ఎప్పుడూ ఏదో ఒక విధంగా తప్పుబట్టడం, ఆమె గురించి ఇంటి సభ్యుల వద్ద లేనిపోనివి చెప్పడం ఆమె ఎలిమినేషన్‌కు దారి తీసిందని నెటిజన్లు అంటున్నారు.

ఫైర్ టాస్క్‌లో యానీ మాస్టర్ చేసిన రచ్చతో ప్రేక్షకులు ఫైరవ్వడంతో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.ఇకపోతే 11 వారాల పాటు హౌస్‌లో వున్నందుకు గాను బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెకు భారీగానే పారితోషికం ముట్టజెప్పారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పనిచేసి సెలబ్రిటీ హోదా ఉన్న యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్‌‌ హౌస్‌లో వున్నందుకు గాను వారానికి ఏకంగా రూ. 3 లక్షల మేర రెమ్యునరేషన్‌ అందినట్లు ఫిలింనగర్ టాక్. ఈ లెక్కన 11 వారాలకు గాను రూ. 30 లక్షలకుపైగానే రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు లెక్క. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో యానీ మాస్టర్‌కే తెలియాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus