Guppedanta Manasu July 28th: రిషిని అల్లుడు అంటూ పిలిచిన చక్రపాణి… షాక్ లో ఏంజెల్!

బుల్లితెర ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…వసుధార చెప్పకుండా తన ఇంటికి వెళ్ళిపోతుంది రిషి తాను రాకపోవడంతో కంగారుపడుతూ ఫోన్ చేస్తాడు అయినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయదు దీంతో ఎక్కడున్నావు అంటూ రిషి మెసేజ్ చేస్తాడు. మీరు ఇందుకోసమే కాల్ చేశారని నాకు తెలుసు మీరు కంగారు పడకండి నేను మా ఇంటికి వచ్చాను అంటూ వసుధార మెసేజ్ చేస్తుంది. అంతలోనే ఏంజెల్ వచ్చి రిషి వసుధార ఎక్కడుందో తెలిసిందా అని చెప్పడంతో తన ఇంటికి వెళ్లిపోయారట అని రిషి చెబుతాడు.వెంటనే ఏంజెల్ మనం అక్కడికి వెళ్లి వసుధారని చూసేసి వద్దాం పద అని చెప్పడంతో ఈ టైంలో నా నేను రానని రిషి చెబుతాడు కాకపోతే ఏంజెల్ రిక్వెస్ట్ చేయడంతో వెళ్తాడు.

కారులో ప్రయాణిస్తుండగా ఏంజెల్ నువ్వు వసుధార కోసమే వస్తున్నావు కదా అంటూ మాట్లాడుతుంది. అదేం లేదు ఈ టైంలో నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేకే వచ్చానని రిషి చెబుతాడు. నీకు తెలుసా రిషి నేను ఎవరితోనూ పెద్దగా కలవను కానీ వసుధారతో కలిసాను అంటే తాను అందరితోనూ అంతగా కలిసిపోతుంది తను చాలా మంచి అమ్మాయి నువ్వు తనని అర్థం చేసుకుంటే తను నీకు కూడా బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది అంటూ ఏంజెల్ వసుధార గురించి చెబుతుంది. ఇక రిషి వసుధార వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడగడంతో ఏంజెల్ చెప్పినట్టు రిషి తనని వసు ఇంటికి తీసుకెళ్తాడు.

ఇంటి ముందు కారు ఆపిన రిషి నేను రాను నువ్వు వెళ్లి చూసి వచ్చేయని చెబుతాడు. ఇక ఏంజెల్ రిక్వెస్ట్ చేయడంతో రిషి కూడా లోపలికి వెళ్తాడు రిషి ని చూసిన చక్రపాణి అల్లుడు గారు రండి అంటూ నోరు జారుతారు. ఇలా చక్రపాణి రీషిని అల్లుడు అని పిలవడంతో ఏంజెల్ షాక్ అవుతుంది. ఏమన్నారు అని ఏంజెల్ అనడంతో బాబు గారు అని పిలిచానని చక్రపాణి మాట మారుస్తారు అదేంటో నాకే ఈమధ్య అన్ని ఇలా వినపడుతున్నాయి. మహేంద్ర సార్ ని రిషి డాడ్ అని పిలిచారు. ఇప్పుడు చక్రపాణి గారు రిషిని అల్లుడు గారు అని పిలుస్తున్నారు అని ఏంజెల్ అనుకుంటుంది.

రిషి వాళ్ళు రావడంతో చక్రపాణి వసుధారణ పిలుస్తారు వసుధార హాల్లోకి రాగానే అసలు చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చావు అంటూ ఏంజెల్ వసుధారను నిలదీస్తుంది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్దామని అనుకుంటారు.చక్రపాణి వసుధార భోజనం చేసి వెళ్లండి అని చెప్పడంతో రిషి అవసరం లేదు వెళ్తామని చెప్పగా ఏంజెల్ మాత్రం భోంచేసి వెళ్దాం రిషి అని చెబుతుంది. ఇంతసేపైనా వచ్చి వసు వాళ్ళ అమ్మగారు కనిపించలేదు ఏంటి అని రిషి వెతుకుతూ ఉంటారు. ఇక ఏంజెల్ భోజనం చేయగా రిషి మజ్జిగ తాగుతారు అయితే కొద్దిగా తాగి గ్లాస్ అక్కడ పెడతారు. ఏంజెల్ రిషి బయటకు వెళ్ళగా వసుధార మాత్రం ఆ మజ్జిగ తాగుతూ ఉంటుంది.

అంతలోపే రిషి లోపలికి వస్తాడు. వసుధార మజ్జిగ తాగడం చూసి ఆ గ్లాస్ లాక్కోపోతాడు దాంతో వసుధార ఎందుకు ఈ గ్లాస్ లాక్కుంటున్నారు అనడంతో ఆ మజ్జిగ నువ్వెందుకు తాగుతున్నావని వసుధారతో గొడవకు దిగుతారు నాకు ఇలా ఫుడ్ వేస్ట్ చేయడం ఏమాత్రం నచ్చదు అంటూ వసుదార సమాధానం చెబుతుంది.నువ్వెందుకు ఈ మజ్జిగ తాగుతున్నావో నాకు తెలుసు కానీ సమాధానం నా నుంచి రాబట్టాలని చూస్తున్నావు అంటూ సీరియస్ గా అక్కడే కారు తాళాలు ఉండడంతో వాటిని తీసుకొని వెళ్లిపోతారు. వసుధార మాత్రం ఆ మజ్జిగను తాగుతూ మీరు వదిలేసినవి నేను ఇష్టంగా తాగుతాను సార్ అనుకుంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus