లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కించబోతున్న అనిల్ రావిపూడి..?

‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’… ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేయాలని చాలా మంది యువ హీరోలు, దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ అనిల్ తన నెక్స్ట్ సినిమా పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అనిల్ రావి పూడి నెక్స్ట్ చిత్రం కూడా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతుందని… అందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం అనిల్ చేయబోయే తదుపరి చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. గతంలో నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుందట. ఇక ఈ కథతో పాటు… నందమూరి బాలకృష్ణ కోసం కూడా ఓ కథ సిద్ధం చేసుకున్నాడట అనిల్. ఇదిలా ఉండగా… అనిల్ ముందుగా లేడీ ఓరియెంటెడ్ కథను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఈ కథకు తగ్గ హీరోయిన్ ని వెతికే పనిలో ప్రస్తుతం అనిల్ బిజీగా ఉన్నాడట. ఎలాంటి సబ్జెక్టు ఎంచుకున్నా.. మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ , అలాగే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకుంటాడు అనిల్ రావిపూడి. ఆ తరహాలోనే.. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం తెరకెక్కుతోందని.. ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus