Ram Pothineni: రామ్‌ కొత్త దర్శకుడు అతనేనా?

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోల లిస్ట్‌ పెద్దగానే ఉంది. అందులో ఎనర్జిటిక్‌ హీరో అనగానే గుర్తొచ్చే పేర్లలో రామ్‌ ఒకటి. ఆయన ఎనర్జీని మ్యాచ్‌ చేయగలిగే దర్శకులు కొద్ది మందే ఉంటారు. అందులో ముఖ్యంగా వినిపించే పేర్లలో అనిల్‌ రావిపూడి ఒకరు. ఆయన హీరోలు చాలా ఫాస్ట్‌గా ఉంటారు. జోవియల్‌గా ఉంటారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండు అని సినిమా అభిమానులు కోరుకుంటూనే ఉంటారు. గతంలో ఒకసారి సెట్‌ అయినట్లే అయ్యి ఆగిపోయింది. అయితే ఇప్పుడు కుదిరేలా కనిపిస్తోంది.

‘రాజా ది గ్రేట్‌’ సమయంలో కచ్చితంగా చెప్పాలంటే ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌కు ముందు రామ్‌ – అనిల్‌ రావిపూడి కలసి ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఆ సినిమా కథేంటి అనేది చెప్పలేదు కానీ… అందులో హీరో అంధుడు అని చెప్పారు. అయితే చర్చల తర్వాత రామ్‌ ఆ సినిమా చేయడం లేదని తేల్చేశారు. కారణాలు తెలియదు కానీ ఆ సినిమా రవితేజ దగ్గరకు వెళ్లిపోయింది. ఇప్పుడు అనిల్‌.. మరో కథ సిద్ధం చేసి వినిపించారట.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో రామ్‌ తిరిగి మాస్‌ హీరోగా జోరందుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు బెడిసికొట్టాయి. దీంతో కాస్త ఆలోచించి కొత్త సినిమాలు చేస్తున్నాడు. లింగుస్వామి సినిమా కూడా ఇలానే చాలా రోజులు చర్చించి పట్టాలెక్కించారు. ఈ సినిమా అయ్యాక అనిల్‌ రావిపూడి సినిమా ఉంటుందని టాక్‌. ఈ లోపు అని ‘ఎఫ్‌ 3’ పనులు పూర్తి చేసేస్తారట. చూద్దాం. అప్పుడు వద్దనుకున్నది ఇప్పుడు అవుతుందేమో.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus