Anil Ravipudi, Chiranjeevi: చిరంజీవి అనిల్ మూవీని ఆ సినిమా రేంజ్ లో ప్లాన్ చేశారా?

Advertisement

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన అనిల్ రావిపూడి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేయాలని ఫీలవుతున్నారు. ఇప్పటికే వెంకటేశ్, బాలయ్యలతో అనిల్ రావిపూడి సినిమాలు చేయగా చిరంజీవి, నాగార్జునలతో బ్యాలెన్స్ ఉంది. ఈ ఇద్దరు హీరోలతో అనిల్ సినిమాలు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. భగవంత్ కేసరి మూవీ కమర్షియల్ సక్సెస్ తో అనిల్ రావిపూడి ఎలాంటి సబ్జెక్ట్ లను అయినా డీల్ చేయగలరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే చిరంజీవి అనిల్ కాంబోలో మూవీ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. వరుసగా ఏడు విజయాలు సాధించిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చంటబ్బాయ్ తరహాలో ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో మరో సంచలనం సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనిల్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉంది.

కెరీర్ విషయంలో అనిల్ రావిపూడి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రతి సినిమా సక్సెస్ సాధించడానికి అవసరమైన జాగ్రత్తలను తీసుకోవడం వల్లే అనిల్ రావిపూడి కోరుకున్న విజయాలు దక్కుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెడితే అనిల్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య అనిల్ కాంబినేషన్ లో మరో సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Anil Ravipudi) అనిల్ రావిపూడి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news