మల్టీస్టారర్ మూవీ చేస్తున్నానంటూ చెప్పిన అనిల్ రావిపూడి

డైలాగ్ రైటర్ గా అనేక విజయాలను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి డైరక్టర్ గా మారి హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. అతను దర్శకత్వంలో తెరకెక్కిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సారి మల్టీస్టారర్ మూవీ చేయనున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి F2 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం అనిల్ వైజాగ్ లో ఉన్నారు.

తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందంటూ బీచ్ ఒడ్డున ఈ సినిమా టైటిల్ ఎఫ్ 2 అంటూ ఇసుకలో రాసి ఫోటో దిగి పోస్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు పెడతానని, అందుకే హైదరాబాద్ కి వస్తున్నా.. అని స్పష్టంచేశారు. ప్రస్తుతం వెంకటేష్ తేజ దర్శకత్వంలో “ఆట నాదే వేట నాదే” అనే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అలాగే వరుణ్ తేజ్ తొలి ప్రేమ తర్వాత సంకల్ప్ రెడీ డైరక్షన్లో మూవీ చేస్తున్నారు. అంతరిక్షంలో ఈ స్టోరీ సాగనుంది. ఇందులో వ్యోమగామి (రోదసి యాత్రికుడు) గా వరుణ్ తేజ్ నటించనున్నారు. ఈ సినిమాల తర్వాత V 2 ( వెంకటేష్, వరుణ్ తేజ్) లు F2 చిత్రీకరణలో పాల్గొననున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus