ట్వీట్ చేసినంత మాత్రాన సినిమా చేసేస్తాడా..?

ఏ చిత్రమైన తనకి నచ్చితే ఇట్టే తన ట్విట్టర్ ద్వారా ఆ చిత్రానికి సంబంధించిన వారికి తన అభినందనలు చెబుతూ ట్వీట్ చేయడంలో… ముందు వరుసలో ఉంటాడు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అలా చెప్పినంత మాత్రాన ఆ డైరెక్టర్ తో సినిమా చేసెయ్యాలని ఏమాత్రం తొందరపడడు. తనకి ఏ కథ సెట్ అవుతుందో.. అని ఆచి.. తూచి అడుగులేస్తుంటాడు. అయితే అలా ట్వీట్ చేసిన వెంటనే మహేష్ బాబు ఆ డైరెక్టర్ తో సినిమా చేసేస్తాడని చాలా వార్తలు వస్తుంటాయి.

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎఫ్‌ 2’ చిత్రం చూసిన వెంటనే.. సినిమా చాల బాగుందని.. వెంకటేష్, అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ , దిల్ రాజులను పొగుడుతూ ట్వీట్ చేసాడు. అనీల్ రావిపూడి కూడా మహేష్ బాబు నన్ను భుజం తట్టి ప్రోత్సహించారని ‘ఎఫ్2’ సక్సెస్ మీట్లో చెప్పాడు. ఇక అంతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చేస్తుందని తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. కేవలం ట్వీట్ చేసినంత మాత్రాన సినిమా చేసేస్తాడు అనుకుంటే.. డైరెక్టర్ క్రిష్,రాజమౌళి లాంటి డైరెక్టర్లతో మహేష్ ఎప్పుడో సినిమా చెయ్యాలి. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి స్వయంగా మహేష్ అనౌన్స్ చేస్తే తప్ప… అది కన్ఫర్మ్ కాదన్న సంగతి తెలిసిందే. పాలనా డైరెక్టర్లు, నిర్మాతలతో ఉన్న బంధంతో మహేష్ ఈ ట్వీట్లు చేస్తాడని కూడా కరెక్ట్ గా చెప్పలేం. ఒక్క ‘వినయ విధేయ రామా’ చిత్రానికి తప్ప.. ఈ సంక్రాంతికి విడుదలైన మూడు చిత్రాలకి మహేష్ అభినందిస్తూ ట్వీట్ చేసాడు. అంత మాత్రాన ఈ ముగ్గురి డైరెక్టర్లతో మహేష్ సినిమా చేస్తాడని ఊహించలేము.ప్రస్తుతానికైతే సుకుమార్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తో తన నెక్స్ట్ సినిమాలు ఉంటాయని తెలుస్తుంది. ఇక తన 25 వ చిత్రం ‘మహర్షి’ … ఈ సమ్మర్ కి విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus