దర్శకుడు అనిల్ రావిపూడిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. వైరల్ అవుతున్న వీడియో

‘జబర్దస్త్’ తర్వాత బుల్లితెర పై కామెడీ షోల హవా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ షో వల్ల జనాలు కామెడీ సినిమాలను పక్కన పెట్టారు. బుల్లితెర పై ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ దొరుకుతున్నప్పుడు.. టికెట్ కొని థియేటర్ వరకు వెళ్లాలా అని భావించి జనాలు వాటిని స్కిప్ చేసేస్తున్నారు. అయితే జబర్దస్త్ లా మరో ఛానల్ లో ప్రారంభమైన కామెడీ షోలు క్లిక్ అవ్వలేదు. జీ, స్టార్ మా వంటి ఛానల్స్ లో కామెడీ షోలు స్టార్ట్ అయ్యాయి కానీ అవి జబర్దస్త్ రేంజ్లో క్లిక్ అయినవి కావు.

అయితే తాజాగా ఆహా ఓటీటీ సంస్థ ‘కామెడీ స్టాక్‌ ఎక్సైంజ్‌’ పేరిట ఓ కామెడీ షోని ప్రారంభించింది.టాక్ షో, సింగింగ్ షో, డాన్స్ షో అయిపోయాక ఇప్పుడు కామెడీ షో పై పడింది ఆహా. ఈ షో స్టార్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. హోస్ట్ లుగా సుడిగాలి సుధీర్‌, దీపిక పిల్లి చేస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

ఈ ప్రోమోలో ముక్కు అవినాష్ వంటి కంటెస్టెంట్లు స్కిట్స్ లో తమ మార్క్ కామెడీతో అలరించినట్టు ప్రోమో ఉంది. మరీ ముఖ్యంగా సద్ధాం, ముక్కు అవినాష్‌ కామెడీ ట్రాక్ అయితే హైలెట్ అనేలా ఉంది. పనిలో పనిగా హోస్ట్ సుడిగాలి సుధీర్ ను కూడా ఆడేసుకున్నారు కంటెస్టెంట్లు. ఇదే క్రమంలో జడ్జి అనిల్‌ రావిపూడి… మరో హోస్ట్ అయిన దీపిక పిల్లికి ముద్దు పెట్టడం కూడా హైలెట్ అయ్యింది. ప్రోమో మొత్తంలో ఇదే హైలెట్ అయ్యింది.

అయితే అది ఏ సందర్భంలో జరిగింది అనేది ఫుల్ ఎపిసోడ్ వస్తే కానీ చెప్పలేం. ప్రస్తుతానికి ప్రోమో అయితే వైరల్ అవుతుంది. అలాగే అనిల్ రావిపూడిలో ఈ సెగలు కూడా ఉన్నాయా అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేయడం మొదలుపెట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోని మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus