మరో అరుదైన గౌరవం దక్కించుకున్న ‘ఎఫ్2’ చిత్రం..!

గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు దక్కడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ‘ఇండియన్ పనోరమా కేటగిరీ ఫర్ 2019’ లో ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఈ చిత్రానికి అవార్డు దక్కింది. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘త్వరలో ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ ని కూడా తెరకెక్కించాలని రెడీ అవుతున్న తరుణంలో ‘ఎఫ్2′ చిత్రానికి ఈ అవార్డు దక్కడం మాకు బూస్టప్ ఇచ్చిందని’ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. బాలీవుడ్ తో పాటు పలు ప్రాంతీయ భాషల సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించిన తరుణంలో..అవార్డు దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రంగా ‘ఎఫ్‌ 2’ రికార్డు సృష్టించింది. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం రూ.80కోట్ల షేర్ ను నమోదు చేసి..

డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ‘మోర్ ఫన్’ అంటూ రాబోతున్న ‘ఎఫ్3′ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.’ఎఫ్2’ ను నిర్మించిన దిల్ రాజే.. ‘ఎఫ్3’ ని కూడా నిర్మించబోతున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus