Animal Collections: ‘యానిమల్’ మొదటి వీకెండ్ ఎలా కలెక్ట్ చేసిందంటే?

రణబీర్ కపూర్,’అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. రెండో రోజు అన్ని సినిమాలు మాదిరే, ఈ సినిమా ఓపెనింగ్స్ తగ్గాయి.అయినా కూడా చాలా బాగా హోల్డ్ చేసింది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూడో రోజు కూడా ఈ సినిమా సూపర్ గా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 8.60 cr
సీడెడ్ 1.64 cr
ఉత్తరాంధ్ర 1.86 cr
ఈస్ట్ 1.02 cr
వెస్ట్ 0.86 cr
గుంటూరు 0.90 cr
కృష్ణా 1.08 cr
నెల్లూరు 0.53 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 16.49 cr

‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ వీకెండ్ ముగిసేసరికి రూ.16.49 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఆల్రెడీ బయ్యర్స్ కి రూ.5.29 కోట్ల లాభాలను అందించింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus