Animal Trailer Review: ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు ఉన్నాయి… కానీ పర్వాలేదు..!

రణ్‌బీర్‌ కపూర్‌ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’. రణ్‌బీర్‌ కపూర్‌ సరసన రష్మిక మందన నటించింది. తండ్రీ కొడుకుల బంధం గురించి ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూశాం. అయితే ‘యానిమల్‌’ సినిమాలో డిఫెరెంట్ గా చూపించబోతున్నారు అని టీజర్ తోనే చెప్పకనే చెప్పాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. దీంతో సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

డిసెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది కూడా ‘అర్జున్ రెడ్డి’ లానే 3 నిమిషాలు పైనే ఉంది అని చెప్పాలి. అవును ‘యానిమల్’ ట్రైలర్ 3 నిమిషాల 32 సెకన్ల నిడివి కలిగి ఉంది. టీజర్లో లానే ఇందులో కూడా తండ్రీ కొడుకుల బంధం గురించి ఎక్కువగా చూపించారు. కాకపోతే రివేంజ్ యాంగిల్, యాక్షన్ డోస్ హైలెట్ అయ్యింది.

తండ్రి కోసం కొడుకు ఓ (Animal) యానిమల్ గా మారితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా లైన్ అని తెలుస్తుంది. ‘నీ తండ్రి పై నీకున్నది ప్రేమ కాదు రోగం’ అంటూ హీరోయిన్ రష్మిక పలికే డైలాగ్ దర్శకుడు సందీప్ బోల్డ్ నెస్ ను మరోసారి అందరికీ తెలియజేసేలా చేసింది అని చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కూడా అక్కడక్కడా కనిపించాయి.

ట్రైలర్ చివర్లో ‘కే.జి.ఎఫ్ 2 ‘ లో యష్..లా, ‘విక్రమ్’ లో కమల్ హాసన్ లా పెద్ద గన్ తో హీరో రణబీర్ కాల్పులు జరపడం గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది అని చెప్పాలి. ట్రైలర్ 3 నిమిషాలు పైనే ఉన్నా… ఆ ఫీలింగ్ కలుగదు. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సినిమా కూడా 3 గంటలు పైగా ఉంటుందట. మరి ట్రైలర్లానే అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus