3 మూవీ తో టాలీవుడ్ కి పరిచయం అయ్యి , మొన్నటి దేవర & కింగ్డమ్ వరకు తనదైన శైలిలో విభిన్న స్వరాలతో యువతను ఉర్రుతలూగిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.అనిరుధ్ మాత్రం తాను సైన్ చేసిన మూవీకి ప్రాణం పెట్టి పని చేస్తాడు అనే పేరు వుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, అనిరుద్ మాత్రం తన కిక్ ఇచ్చే మ్యూజిక్ తో ఎప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటాడు.
అయితే ఇప్పుడు అనిరుధ్ సుమారు 10 సినిమాలకి వర్క్ చేస్తున్నాడు . వాటిలో ముఖ్యంగా ఇళయ దళపతి విజయ్ ప్రతీష్టాత్మక ప్రాజెక్ట్ “జన నాయగన్”, సూపర్ స్టార్ రజిని కాంత్ నటిస్తున్న “జైలర్ 2” , నాని “పారడైస్ ” , ప్రదీప్ రంగనాథ్ “lik (లవ్ ఇన్సురెన్స్ కంపెనీ ), kgf యష్ ప్రాజెక్ట్ ” టాక్సిక్ “, వెట్రిమారన్ డైరెక్షన్ లో అజిత్ నటిస్తున్న “ak64”. ఇలా పెద్ద హీరోలతో మరియు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో అనిరుద్ వరుస అప్డేట్ లతో మార్కెట్ లో తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు కనపడుతుంది.
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ప్రాజెక్ట్స్ & వివరాలు
LoveInsuranceKompany: అనిరుధ్ స్టైల్‌లో ఎనర్జిటిక్ ట్రాక్స్‌తో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.
JanaNayagan: పవర్‌ఫుల్ పొలిటికల్ వైబ్‌తో కూడిన ఆల్బమ్; ఫస్ట్ సింగిల్ త్వరలో.
Magic: మ్యూజికల్ ఫాంటసీ — ఫ్రెష్ సౌండ్ డిజైన్, ఎమోషనల్ టచ్‌తో.
TheParadise: హై ఇంటెన్సిటీ మ్యూజిక్ వైబ్స్ .
Toxic: డార్క్, ఎక్స్‌పెరిమెంటల్ — పూర్తిగా కొత్త సౌండ్ ట్రాక్.
DC: హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.
Jailer2: మాస్ లోడెడ్ సీక్వెల్
AK64: రాక్ + ఎలక్ట్రానిక్ ఫ్యూజన్ కలిపిన హై-ఆక్టేన్ ఆల్బమ్.
Arasan: క్లాసికల్ + మోడర్న్ ఫ్యూజన్‌తో రాయల్ థీమ్స్.
KING: స్టైలిష్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సౌండ్ ట్రాక్.