రాజ్ తరుణ్ సరసన అనీషా!
- March 29, 2016 / 02:08 PM ISTByFilmy Focus
నాలుగేళ్ల క్రితం వచ్చిన “అలియాస్ జానకి” చిత్రంతో కథానాయకిగా పరిచయమైన అనీషా ఆంబ్రోస్ కు ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో సరైన అవకాశాలు లభించలేదు. దాంతో కొంత విరామానంతరం “రన్” సినిమాతో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకొంది. అయినా కూడా సరైన విజయం దక్కలేదు. దాంతో ఇక ఆమె కెరీర్ షెడ్డుకి వెఌపోయినట్లే అనుకొన్నారందరూ.
కానీ.. అనూహ్యంగా రాజ్ తరుణ్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకొంది. సుకుమార్ అసిస్టెంట్ నాని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో రాజ్ తరుణ్ కు జంటగా అనీషా నటిస్తోంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















