సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన సంగతి కూడా ఆమెకు తెలీదా..?

‘యం.యస్.ధోని’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా డిప్రెషన్ కు లోనైన సుశాంత్… నిన్న ముంబై లోని తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా విషాదానికి గురయ్యింది.

ఇప్పటి వరకూ 12 సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న సుశాంత్… కెరీర్ ప్రారంభంలో కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. ఆయన నటించిన ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్ పెద్ద హిట్ అయ్యింది. ఆ సీరియల్ షూటింగ్ సమయంలోనే తన సహ నటి అంకిత లోఖండే తో ప్రేమలో పడ్డాడు. ఆ సీరియల్ లో వీరిద్దరి పెయిర్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ కొన్నాళ్ళ పాటు డేటింగ్ చేశారు. అయితే తరువాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు.

అటు తరువాత ఇద్దరూ వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు… మంచి స్నేహితులు గా కూడా కొనసాగుతూ వచ్చారు. అయితే నిన్న సుశాంత్ చనిపోయిన వార్త తెలిసిన తరువాత… ఓ ఛానెల్ వారు అంకిత కు ఫోన్ చేశారట. అయితే అప్పటికి సుశాంత్ చనిపోయిన విషయం ఆమెకు తెలీదట.అయితే ఆ టీవీ ఛానెల్ వారు సుశాంత్ చనిపోయాడు అన్న విషయం చెప్పగానే ఆమె వెంటనే ఫోన్ కట్ చేసినట్టు సమాచారం.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus