Vakeel Saab: పవన్ కళ్యాణ్ సినిమాకి మరో దెబ్బ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది. దాంతో అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది ఈ చిత్రం. అయితే ఆంధ్రప్రదేశ్ లోని అధికార ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వకపోగా.. టికెట్ రేట్లను మరింతగా తగ్గించేసి కలెక్షన్ల పై దెబ్బ పడేలా చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. అయితే దాని వలన సినిమాకి మరింతగా వార్తల్లో ఉండేలా చేస్తూ వారు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారనే చెప్పాలి. అందువల్ల ఎక్కువ మంది ఈ చిత్రం చూడడానికి ఎగబడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఓ చోట ‘వకీల్ సాబ్’ థియేటర్లను సీజ్ చెయ్యడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే ఏపీ ప్రభుత్వం వల్ల కాదులెండి. దీనికి ముఖ్య కారణం కరోనా. ఒడిశా రాష్ట్రంలో కూడా తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శ్రీకాకుళం సరిహద్దులో ఉండే పర్లాకిమిడి పట్టణంలో ప్రతీ తెలుగు సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. అక్కడ తెలుగు జనాలు ఎక్కువ మంది ఉండడం కూడా ఓ కారణం అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. పర్లాకిమిడిలోని ‘జై మా’ ‘లక్ష్మీ’ థియేటర్లలో తాజాగా ‘వకీల్ సాబ్’ విడుదలయ్యింది. సినిమాకి హిట్ టాక్ రావడంతో అక్కడి ప్రేక్షకులు సినిమా చూడడానికి ఎగబడ్డారు.

ఒడిస్సాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడి థియేటర్లకు 50 శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ ‘వకీల్ సాబ్’ కు ఉన్న డిమాండ్ వల్ల ఆ థియేటర్ యాజమాన్యం వారు నిబంధనలు ఉల్లంఘించి నూటికి నూరుశాతం టికెట్లు అమ్ముకున్నారు.అక్కడి అధికారులకు ఈ విషయం తెలీడంతో … కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నేరానికి ‘జై మా, లక్ష్మీ టాకీస్’ థియేటర్లను సీజ్ చేసి వారికి షాక్ ఇచ్చారు. అంతే కాదు ఆ థియేటర్ల యాజమాన్యానికి రూ.10 వేల చొప్పున జరిమానా కూడా విధించడం జరిగింది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus