మరో బాలీవుడ్ నటి పెళ్లి పిక్స్.. వైరల్ అవుతున్న స్విని ఖరా ఎంగేజ్మెంట్ ఫోటోలు!

ఒకప్పుడు పెళ్ళంటే ఏదో ఒక మాట చెప్పి దాటేసేవారు బాలీవుడ్ నటీనటులు. కానీ వారి తర్వాతి జెనరేషన్ మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. గతంలో విడాకులు తీసుకున్నవారు సైతం.. ఇంకో పెళ్లి చేసుకుని ఒంటరితనాన్ని వదిలించుకుంటున్నారు. 2023 లో రాహుల్ – అతియా శెట్టి ల ఎంగేజ్మెంట్ జరిగింది. కియారా – సిద్దార్థ్ మల్హోత్రాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు మరో బాలీవుడ్ నటి ఎంగేజ్మెంట్ చేసుకుని హాట్ టాపిక్ అయ్యింది.

స్విని నిమేష్ ఖరా… టీవీ షో బా బహూ ఔర్ బేబీలో కొంటె చైతాలి పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అమితాబ్-టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చీనీ కమ్’ లో స్విని నిమేష్ ఖరా పోషించిన పాత్రకు గాను ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. ఈ చిత్రంలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. అమితాబ్ కు మంచి స్నేహితురాలి పాత్రలో ఆమె ఈ మూవీలో నటించింది.

ఇటీవల ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఈమె పెళ్లి ఘనంగా జరిగినట్టు స్పష్టమవుతుంది.అందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో తమ ఫాలోవర్స్ తో పంచుకుంది. స్విని నిమేష్ ఖరా తన స్నేహితులు అవికా గోర్, నవికా కోటియా వంటి కొత్త జంటలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఎం.ఎస్.ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ సినిమాలో కూడా జయంతి అనే పాత్రలో కనిపించింది స్విని. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బా బహూ ఔర్ బేబీ, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి టీవీ షోలలో కూడా ఈమె భాగమైంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus