కాస్టింగ్ తోనే ఆసక్తి పెంచేస్తున్న శంకర్

కమలహాసన్ – శంకర్ కాంబినేషన్లో ‘ఇండియన్ 2’ (తెలుగులో భారతీయుడు-2) తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కమల్- శంకర్ కంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనిలోనే శంకర్ బిజీగా ఉన్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారట. దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వార్త హల చల్ చేస్తుంది. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర కోసం శింబు ను తీసుకున్నారని సమాచారం. ఎప్పుడూ శంకర్ చిత్రాలకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తారు కానీ ఈ సరి యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ను తీసుకున్నాడంట శంకర్. డిసెంబర్ 14 న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus