అల్లు అర్జున్ చిత్రంలో ఆ బైక్ కీలకమట ..?

అల్లు అర్జున్ వరుసగా మూడు చిత్రాల్ని లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాత సుకుమార్ మరియు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తన తరువాతి సినిమా చేయబోతున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేయబోతున్న చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ‘కనపడుటలేదు’ అనేది ఉపశీర్షిక. ‘ఫిలిప్పినో’ అనే చిత్రానికి ఇది కాపీ అనే ప్రచారం కూడా మొదలైంది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని చిత్ర యూనిట్ కూడా తేల్చేసింది.

అయితే ‘ఐకాన్’ కథ దేనికి సంబంధించింది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ఐకాన్’ పోస్టర్ లో చూపించిన బైక్ కథలో కీలక భాగంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ బైక్ పైనే హీరో ఏదో వెతుకుతూ ఉంటాడని తెలుస్తుంది. ఇంతకీ హీరో వెతికేది ఏంటా.. అన్నదే పెద్ద ట్విస్ట్ అని తెలుస్తుంది. ఏదేమైనా ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు. దిల్ రాజు, బన్నీ కాంబినేషన్లో ఇది నాలుగో చిత్రం. ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus