హీరోగా పరిచయమవ్వబోతున్న అల్లు అర్జున్ మేనల్లుడు..!

టాలీవుడ్లో ఇప్పటికీ స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు అల్లు అరవింద్. ఇండస్ట్రీ పై తనకున్న గ్రిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఓ రేంజ్లో దూసుకుపోతున్నాడు. సౌత్ ఇండియన్ స్టార్ అనే మార్క్ కూడా సంపాదించుకున్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాదు మలయాళంలో కూడా తనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక అల్లు శిరీష్ కూడా కిందా మీదా పడి హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మంచి కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో అడపా దడపా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇదే ఫ్యామిలీ నుండీ మరో హీరో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అతనెవరో కాదు విరాన్ ముత్తంశెట్టి. అల్లు అరవింద్ కు బంధువు.. అల్లు అర్జున్ కు స్వయానా మేనల్లుడు అయిన విరాన్ ముత్తంశెట్టి కి కూడా నటన పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉంది. ‘పుణ్యభూమి నాదేశం’ అనే ఇండిపెండెంట్ ఫిలింలో కూడా నటించాడు. త్వరలోనే హీరోగా కూడా పరిచయం కావడానికి సిద్దమవుతున్నాడు. ‘పి.సి.ఎం. స్టూడియో’ మరియు ‘మైత్రి అసోసియేషన్’ బ్యానర్ల పై చిట్టిశర్మ డైరెక్షన్లో సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి ప్రొడక్షన్ నెం.1గా నిర్మించే ఈ చిత్రం ద్వారా విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఒకపక్క మెగా ఫ్యామిలీ నుండీ తేజు తమ్ముడు వైష్ణవ్ కూడా హీరోగా పరిచయమవుతుండగా ఇప్పుడు ఆ లిస్ట్ లో విరాన్ కూడా చేరడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus