ఊహించని విధంగా వెంకటేశ్‌ సినిమా.. ఇంకా ఎవరెవరు వస్తారో?

మన సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోకు తోడుగా మరో హీరో ఉండాలా? ఏమో గత కొన్ని రోజులుగా సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాల కబుర్లు వింటుంటే ఇలానే అనిపిస్తోంది. అయితే ఆ రెండో హీరో అంత సీనియర్‌ అయి ఉండరు అనుకోండి. తాజాగా ఇలా ‘సినిమాలో ఇంకో హీరో’ అనే మాట వినిపిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. వెంకటేశ్‌ 50వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరో హీరోకు ఛాన్స్‌ ఉందని సమాచారం. ఈ మేరకు ఎంపిక కూడా జరిగిపోయింది అని అంటున్నారు.

శైలేష్‌ కొలను దర్శకత్వంలో త్వరలో ‘సైంధవ్‌’గా సందడి చేయడానికి వెంకటేష్‌ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా గురించి మరో విషయం తెలిసిందే. అదే ఈ సినిమాలో మరో స్టార్‌ హీరోను రంగంలోకి దించేందుకు చిత్ర బృందం సిద్ధమైందట. తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్‌ ఉన్న హీరో ఆర్యను ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

‘సైంధవ్‌’లో ఓ కీలక పాత్ర ఉందని, అది సినిమా కీలక సమయంలో వస్తుందని సమాచారం. దీని కోసం ఎవరు బాగుంటారా అని చూస్తే.. ఆర్య పేరు అనిపించిందని చెబుతున్నారు. ఆ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ తొలి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్‌ ప్రారంభమవుతుందని సమాచారం. పాన్‌ ఇండియా సినిమా కాబట్టి ఇతర పరిశ్రమల నుండి యాక్టర్లను తీసుకొస్తున్నారని కూడా కామెంట్స్‌ వస్తున్నాయి.

ఇక వెంకటేష్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సౌత్‌ లాంగ్వేజ్‌తోపాటు హిందీలోనూ విడుదల చేస్తారు. కథ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా.. పేరు, పోస్టర్‌, లుక్‌ చూస్తే మాత్రం వెంకీ కెరీర్‌లో ఇదొక స్పెషల్‌ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus