Bigg Boss 7 Telugu: 6వ వారం బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటి ? మరోసారి ట్రోలింగ్ తప్పదా..!

బిగ్ బాస్ అంటేనే లవ్ ట్రాక్స్ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా సీజన్ 1 నుంచీ కూడా దీనిని ఆడియన్స్ కి బాగా అలవాటు చేశారు. ఇప్పుడు సీజన్ 7 లో కూడా ఈ లవ్ ట్రాక్ ని మరోసారి స్టార్ట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నిజానికి సీజన్ 7 స్టార్టింగ్ లో పల్లవి ప్రశాంత్ ఇంకా రతిక ల మద్యన లవ్ ట్రాక్ నడిపిద్దామనే బిగ్ బాస్ అనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది.

అయితే, ఇప్పుడు 2.ఓ అంటూ వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇది చేద్దామని అనుకుంటున్నట్లుగానే ఉంది. అసలు మేటర్లోకి వెళితే., బిగ్ బాస్ హౌస్ లో 5 వారాలు గడుస్తున్నా కూడా ప్రిన్స్ యావార్ తెలుగులో మాట్లాడటానికి చాలా కష్టపడుతున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే తెలుగు మాట్లాడుతున్నాడు. దీంతో బిగ్బాస్ టీమ్ టెలికాస్ట్ లో సబ్ టైటిల్స్ వేయాల్సి వస్తోంది. దీనికి బిగ్ బాస్ బాగా ఫ్రస్టేట్ అయ్యాడు. ఇన్ని వారాలు అవుతున్నా బిగ్ బాస్ లో వెలితి ఏంటంటే, అది మీరు తెలుగు మాట్లాడకపోవడమే అంటూ ప్రిన్స్ యావర్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

అంతేకాదు, ఇక నుంచీ అశ్విని మీకు షాడోగా ఉంటుందని, మీరు ఏది మాట్లాడినా కూడా ట్రాన్స్ లేషన్ చేస్తూ ఒక ట్రాన్స్ లేటర్ గా ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. దీంతో వీరిద్దరి మద్యలో కనక్షన్ కుదిరింది. ప్రిన్స్ ఎటు వెళ్తే అటూ అశ్విని వస్తోంది. ఇక ఇదే అదనుగా వీరిద్దరి మద్యలో లవ్ ట్రాక్ నడిపించాలనే అనుకుంటున్నాడు బిగ్ బాస్. అయితే, గత కొన్ని సీజన్స్ గా ఇలాంటివి చూస్తూ వచ్చిన ఆడియన్స్ ఈ కంటెంట్ ని ఇష్టపడట్లేదు.

సీజన్ స్టార్ట్ అయిన మొదట్లో దీనిపై ఎక్కువగా ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఆరోవారం (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఇలాంటి ప్లానింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ నుంచీ మరోసారి ట్రోల్స్ వస్తాయని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అందులోనూ ప్రిన్స్ యావర్ గేమ్ ని ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అశ్విని మాయలో పడి ఆటని అడకెక్కిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రిన్స్ గేమ్ దెబ్బకొట్టేస్తుందని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది..

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus